ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న పక్కా సమాచారంతో నాగర్‌కర్నూల్ జిల్లా నీటిపారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(DEE) సత్యనారాయణకు అవినీతి నిరోధక శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయనపై కేసు నమోదు చేసిన ఏసీబీ బృందాలు.. నాగర్‌కర్నూల్, హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్, నాగోల్ సహా మొత్తం 10 ప్రాంతాల్లో ఏకకాలంలో విస్తృత తనిఖీలు చేపట్టాయి.

ఈ సోదాల్లో కళ్లు చెదిరే స్థాయిలో స్థిర, చరాస్తులు బయటపడ్డాయి. ప్రభుత్వ రికార్డుల విలువ ప్రకారం సత్యనారాయణ ఆస్తుల విలువ రూ. 5 కోట్ల నుంచి రూ. 6 కోట్ల మధ్య ఉండగా, బహిరంగ మార్కెట్లో వీటి విలువ ఏకంగా రూ. 50 కోట్లకు పైగానే ఉంటుందని ఏసీబీ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
సోదాల అనంతరం డీఈఈ సత్యనారాయణను అరెస్ట్ చేసి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి ఆయనకు రిమాండ్ విధించినట్లు ఏసీబీ డీఎస్పీ చలపతి అధికారికంగా వెల్లడించారు. వనపర్తి జిల్లా పరిధిలో ఏకంగా 25 ఎకరాల వ్యవసాయ భూమి, అందులో విలాసవంతమైన ఫామ్‌హౌస్ ఉంది. సత్యనారాయణ పేరిట 9 ఓపెన్ ప్లాట్లు, కోట్ల రూపాయల విలువ చేసే విల్లాలు, ఫ్లాట్లు ఉన్నాయి. హైదరాబాద్ కర్మన్‌ఘాట్‌లో ఒక 3బీహెచ్‌కే ఫ్లాట్, నాగోల్‌లో 2బీహెచ్‌కే ఫ్లాట్ ఉంది.
సుమారు అరకిలో బంగారం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఖరీదైన 3 కార్లు ఉన్నాయి. బ్యాంకు డిపాజిట్లు, ఇతర రూపాల్లో రూ. 20 లక్షల విలువైన సొమ్ము, పలు ఎల్ఐసీ (LIC) పాలసీలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యుల ఆస్తులు, బ్యాంకు లావాదేవీలపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. అరెస్టయిన డీఈఈ సత్యనారాయణ భార్య ప్రస్తుతం విద్యుత్ శాఖ (ట్రాన్స్‌కో)లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఆదాయ వనరులు, కుటుంబ సభ్యుల పేర్లపై కొనుగోలు చేసిన స్థిరాస్తుల వివరాలను కూడా ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఇంత భారీ స్థాయిలో వ్యవసాయ భూములు, ప్లాట్లు, విల్లాలు ఎలా సమకూరాయనే కోణంలో ఏసీబీ లోతైన విచారణ జరుపుతోంది. స్వాధీనం చేసుకున్న ఆస్తి పత్రాలు, బ్యాంకు ఖాతాల లావాదేవీలు, ఇతర పెట్టుబడుల వివరాలను అధికారులు విశ్లేషిస్తున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
{{/usCountry}}ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఇంత భారీ స్థాయిలో వ్యవసాయ భూములు, ప్లాట్లు, విల్లాలు ఎలా సమకూరాయనే కోణంలో ఏసీబీ లోతైన విచారణ జరుపుతోంది. స్వాధీనం చేసుకున్న ఆస్తి పత్రాలు, బ్యాంకు ఖాతాల లావాదేవీలు, ఇతర పెట్టుబడుల వివరాలను అధికారులు విశ్లేషిస్తున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
{{/usCountry}}