Nurse Rape Murder Case : రంగారెడ్డి జిల్లా పరిధిలో నర్సుగా పని చేస్తున్న 21 ఏళ్ల యువతి దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో పోలీసులకు కీలక పురోగతి లభించింది. పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుక్కుగూడ వద్ద జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి ఎండీ సనావుల్లా (34) అనే బైక్ మెకానిక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

తుక్కుగూడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి నివాస గదిలోకి చొరబడిన నిందితుడు, సుత్తితో సదరు యువతి తలపై తీవ్రంగా కొట్టి…. ఆమెపై లైంగిక దాడికి పాల్పడి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
"21 ఏళ్ల నర్సుపై అత్యాచారం, హత్యకు ఒడిగట్టిన నిందితుడిని మా ప్రత్యేక బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. ఈ కేసులోని పూర్తి వివరాలను ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా వెల్లడిస్తాం" అని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
అసలేం జరిగింది…?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన 21 ఏళ్ల యువతి ఏడు నెలల క్రితం హైదరాబాద్‌కు వచ్చి తుక్కుగూడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా చేరింది. ఆసుపత్రి వర్గాలు కేటాయించిన నివాస గదుల్లోనే తన స్నేహితురాలితో కలసి ఆమె నివసిస్తోంది.
శనివారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో, బాధితురాలు ఉదయం నుంచి గది బయటకు రాకపోవడం, ఎంత కొట్టినా తలుపులు తీయకపోవడంతో ఆమె స్నేహితురాలు తోటి సిబ్బందికి సమాచారం ఇచ్చింది. ఆందోళన చెందిన స్నేహితులు కిటికీ గుండా లోపలికి వెళ్లి చూడగా, ముఖంపై తీవ్ర రక్తగాయాలతో ఆమె మంచంపై నిర్జీవంగా పడి ఉంది.
సమాచారం అందుకున్న పహాడీషరీఫ్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. అపరిచిత వ్యక్తులు ఏదో బరువైన వస్తువుతో దాడి చేసి హత్య చేసి ఉంటారని మొదట అనుమానించిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడు బైక్ మెకానిక్ సనావుల్లా అని గుర్తించి శనివారం రాత్రికి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఉస్మానియా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత….
ఈ దారుణ ఘటన బయటపడటంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. బాధితురాలి కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకులు హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రి పోస్టుమార్టం కేంద్రం వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. బాధితురాలికి న్యాయం చేయాలని, నిందితుడిని కఠినంగా శిక్షించడమే కాకుండా ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు.
{{/usCountry}}ఈ దారుణ ఘటన బయటపడటంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. బాధితురాలి కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకులు హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రి పోస్టుమార్టం కేంద్రం వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. బాధితురాలికి న్యాయం చేయాలని, నిందితుడిని కఠినంగా శిక్షించడమే కాకుండా ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు.
{{/usCountry}}"రాఖీ పండగ రోజే ఒక ఆడపిల్లపై ఇంతటి దారుణం జరగడం దురదృష్టకరం. గది కిటికీలు తెరిచి లోపలికి చొరబడిన నిందితుడు సుత్తితో తలపై బాది, లైంగిక దాడికి పాల్పడి హత్య చేశాడు. ఈ ప్రాంతంలో శాంతిభద్రతల పరిస్థితిపై గతంలోనే హైదరాబాద్ సీపీ వి.సి.సజ్జనార్‌కు కూడా ఫిర్యాదు చేశాం. ఈ కేసులో స్థానిక ఇన్ స్పెక్టర్ ఏం చేస్తున్నారు?" అని బీజేపీ నాయకుడు అందెల శ్రీరాములు యాదవ్ ప్రశ్నించారు.