...
...
Next Story

ఎర్ర బస్సు కష్టమన్నారు.. ఆదిలాబాద్‌కు ఎయిర్ బస్ తీసుకొస్తా : సీఎం రేవంత్ రెడ్డి

ఆదిలాబాద్‌కు ఎర్ర బస్సు కష్టమన్నారని, ఎయిర్ బస్ తీసుకొస్తానని రేవంత్ రెడ్డి అన్నారు. త్వరలో ఎయిర్ పోర్టు పనులు ప్రారంభిస్తామని చెప్పారు.

Published on: Dec 4, 2025, 19:13:35 IST
Advertisement

ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్‌లో పర్యటించారు. ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలో రూ. 260.45 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.

శంకుస్థాపన చేసిన పనులు

  • రూ.18.70 కోట్లతో ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 49 వార్డుల సమగ్ర అభివృద్ధి పనులు.
  • రూ.1.75 కోట్ల పెట్టుబడితో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా స్వయం సహాయక మహిళా సంఘాలతో పెట్రోల్ బంక్ స్థాపన.
  • రూ.19.69 కోట్లుతో 160 స్వయం సహాయక సంఘాలకు రుణాల మంజూరు.
  • రూ.200 కోట్లతో పట్టణ పరిధిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణం.
  • 2 కోట్లతో మహాలక్ష్మివాడ, విద్యానగర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణం, ఆధునికీకరణ.
  • శాంతి భద్రతలకు ప్రాధాన్యతనిస్తూ పోలీసు మౌలిక సదుపాయాల కల్పన కోసం పట్టణంలోని సంజయ్ నగర్ ప్రాంతంలో రూ.11.93 కోట్లతో 18 పోలీస్ క్వార్టర్స్, రూ. 2.6 కోట్లతో 3 ఇంటెలిజెన్స్ విభాగానికి క్వార్ట్రర్స్, రూ. 2 కోట్లతో భరోసా కేంద్రాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు.
  • పట్టణాభివృద్ధికి, పరిశ్రమల పురోగతికి, ప్రజల దైనందిన జీవన విధానానికి అత్యంత కీలకమైన అంశం స్థిరమైన, నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఆదిలాబాద్ ఆపరేషన్ సర్కిల్ పరిధిలో రూ. 231.24 లక్షల నిధులతో కొత్త కలెక్టరేట్ సమీపం వద్ద TGNPDCL ద్వారా 33/11 KV సబ్‌స్టేషన్ నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు.

ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ రెడ్డి
ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ రెడ్డి

ఆదిలాబాద్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎ రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆదిలాబాద్ విమానాశ్రయం పనులు ఏడాదిలోపు ప్రారంభమవుతాయని రేవంత్ రెడ్డి ప్రకటించారు. స్థానిక అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో సమగ్ర సౌకర్యాలను కలిగి ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

'ఎర్ర బస్సు రావడమే కష్టమనుకున్న ఆదిలాబాద్‌కు ఎయిర్‌బస్ తీసుకువస్తా. ఏడాది తిరిగేలోగా ఆదిలాబాద్ ఎయిర్ పోర్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. ఇక్కడకు పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది.' అని రేవంత్ రెడ్డి అన్నారు.

ఓటర్లు తమ ఓట్లను 'ప్రజా పాలన' సాధించడానికి సాధనాలుగా మార్చుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి, తాను పూర్తిగా పాలనకు అంకితమయ్యానని రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని రంగాలలో అభివృద్ధి ప్రయత్నాలు కొనసాగుతాయని ప్రతిజ్ఞ చేశారు.

రెండు సంవత్సరాలుగా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పని చేస్తున్నానని రేవంత్ రెడ్డి అన్నారు. చిన్న వయసులో తనకు గొప్ప అవకాశం రావడం సంతోషంగా ఉందని చెప్పారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా కృషి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం పదేళ్లపాటు విపక్ష ఎమ్మెల్యేలకు ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా అనుమతించలేదన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks