హైదరాబాద్ యూనివర్సిటీలో యూజీ, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులకు ప్రవేశాలు

హైదరాబాద్ యూనివర్సిటీలో యూజీ, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులకు ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన, ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

Published on: Jul 8, 2026, 15:02:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి గాను అండర్ గ్రాడ్యుయేట్, ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. 470 సీట్లు గల 17 ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు CUET (UG) 2026 స్కోర్‌ల ఆధారంగా ఉంటాయి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జూలై 21గా నిర్ణయించారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో అండర్ గ్రాడ్యుయేట్, ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సుల్లో చేరాలనుకునేవారికి ఇది మంచి అవకాశం.

హైదరాబాద్ యూనివర్సిటీలో అడ్మిషన్స్
హైదరాబాద్ యూనివర్సిటీలో అడ్మిషన్స్

ఆసక్తిగల విద్యార్థులు తమ CUET (UG) 2026 స్కోర్‌ల ఆధారంగా 17 ప్రత్యేక ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చని యూనివర్సిటీ పేర్కొంది. ఆన్‌లైన్ దరఖాస్తు పోర్టల్ అధికారికంగా జూలై 7న ప్రారంభమైంది. దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ జూలై 21గా నిర్ణయించారనే విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి.

ఈ విశ్వవిద్యాలయం వివిధ విభాగాలలో మొత్తం 470 సీట్లను అందిస్తుంది. ప్రభుత్వ రిజర్వేషన్ విధానాల ప్రకారం(ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ వర్గాలకు కేటాయింపులతో సహా) అడ్మిషన్స్ ఉంటాయి.

ప్రవేశాల్లో 4 సంవత్సరాల బీఎస్ (ఆనర్స్/రీసెర్చ్), కెమిస్ట్రీ, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి ప్రోగ్రామ్‌లు: గణిత శాస్త్రం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అప్లైడ్ జియాలజీ మరియు సైకాలజీ, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎంఏ ప్రోగ్రామ్‌లు: ఫిలాసఫీ, హిందీ, తెలుగు, ఉర్దూ, భాషా శాస్త్రాలు, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంత్రోపాలజీ ఉన్నాయి.

అప్లికేషన్ పీజు జనరల్ అభ్యర్థులకు రూ.300, ఈడబ్ల్యూఎస్: రూ. 200, ఓబీసీ-ఎన్‌సీఎల్ అభ్యర్థులకు రూ. 200, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ(పీహెచ్): రూ. 125గా ఉంది.

ప్రతి ప్రోగ్రామ్‌కు విడివిడిగా మెరిట్ జాబితా రూపొందిస్తారు. దరఖాస్తు రుసుము విజయవంతంగా చెల్లించిన తర్వాత, ఒక 'ఫారం నంబర్' (ఉదా: UOHUG99999999) జెనరేట్ అవుతుంది. దరఖాస్తు ఫారం ప్రింటవుట్ తీసుకుని, భవిష్యత్తు అవసరాల కోసం దానిని భద్రంగా ఉంచుకోండి. ఫారం నంబర్ లేని పక్షంలో దరఖాస్తు పరిగణనలోకి తీసుకోరు.

అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను విశ్వవిద్యాలయం అధికారిక అకడమిక్ పోర్టల్ అయిన http://acad.uohyd.ac.in ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో పూర్తి చేసి సమర్పించాలి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More