రైతు భరోసా పథకాన్ని నిలిపివేస్తున్నారని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని వ్యవసాయశాఖ స్పష్టం చేసింది. అలాంటి వార్తలు పూర్తిగా అవాస్తవం, నిరాధారమైనవని క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు వివరణలతో కూడిన ప్రకటనను విడుదల చేసింది.

రైతు భరోసా కింద తెలంగాణ వ్యాప్తంగా 65 లక్షల మందికి పైగా రైతులు లబ్ధి పొందుతున్నారని వ్యవసాయశాఖ పేర్కొంది. ఆ పథకాన్ని ప్రభుత్వం ఆపడం లేదని… నిలిపివేయడం లేదని వివరించింది. ప్రస్తుతం సంబంధిత జిల్లా కమిటీలు నిజమైన లబ్ధిదారులకు మాత్రమే పంట పెట్టుబడి సహాయం అందేలా చూసుకోవడానికి గ్రౌండ్ వెరిఫికేషన్ ను నిర్వహిస్తున్నాయని వెల్లడించింది.
ఆర్ధిక శాఖ కూడా లబ్ధిదారులకు చెల్లింపులు చేయడం కోసం వారి జాబితాను సిద్ధం చేసి తిరిగి తనిఖీ కూడా నిర్వహిస్తోంది. రైతు భరోసా నిలిపివేస్తున్నారని అని ప్రచారమవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని వ్యవసాయశాఖ స్పష్టం చేసింది.
శాటిలైట్ మ్యాపింగ్ పై వివరణ
వాణిజ్య వినియోగంలో ఉన్న భూములకు సంబంధించి రైతు భరోసా ప్రయోజనాలు పొందుతున్న వారిని ఆ జాబితా నుండి తొలగించడానికి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం జర్మన్ టెక్నాలజీ సహాయంతో 'శాటిలైట్ మ్యాపింగ్’ నిర్వహిస్తోంది. 2024 సంవత్సరంలో నిర్వహించిన ఒక గ్రౌండ్ సర్వే ప్రకారం 4 లక్షల ఎకరాల భూమి… ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల, ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్ పరిధిలో వాణిజ్య వినియోగంలో ఉంది.
ఈ మ్యాపింగ్ ప్రక్రియ ద్వారా ప్రతి లబ్ధిదారుని దగ్గర ఎంత భూమి సాగు విస్తీర్ణంలో ఉందొ నిర్దారించవచ్చు. రైతు భరోసా పొందుతున్న భూమి రియల్ ఎస్టేట్ వెంచరా, కొండ, రోడ్ లేదా ఫామ్ హౌస్ అని ధృవీకరించడానికి కూడా ఇది సహాయపడుతుంది. వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్న భూములు రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం ఇచ్చే ఆర్ధిక సహాయం పొందడానికి అర్హత కలిగినవి కావు. మ్యాపింగ్ ప్రక్రియ అనేది ఫీల్డ్ డేటాను రికార్డులతో ధృవీకరించడానికి మాత్రమే.
మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, గ్రౌండ్ రియాలిటీ ఆధారంగా జాబితా నుండి తొలగింపులు ఉంటాయి. ప్రస్తుత పరిస్థితి రైతు భరోసా పథకం కింద తెలంగాణ వ్యాప్తంగా 65 లక్షల మందికి పైగా రైతులు లబ్ధి పొందుతున్నారు. గత సంవత్సరం సుమారు రూ. 8,500 – రూ. 9,000 కోట్లు వారికీ పంపిణీ చేయడం జరిగింది.
- తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి షరతులు విధించలేదు.
- ఒక రైతు రబీ/ఖరీఫ్ కాలాలలో పంటను పండించవచ్చు. అటువంటి వారు కూడా రైతు భరోసా పథకానికి అర్హులే.
- ఒక సీజన్లో ఒకే పంట పండించినా రైతులకు కూడా ఆర్థిక సహాయం అందించబడుతుంది.
- అందరు లబ్ధిదారులుకు రెండు సీజన్లకు ఎకరానికి రూ. 12,000 అందుతుంది.
- జాబితా నుండి పేర్లు తొలగించబడి, అభ్యంతరాలు ఉన్న రైతులు వివరణ కోసం జిల్లా కలెక్టర్, జిల్లా స్థాయి రెవెన్యూ అధికారులను సంప్రదించవచ్చు. రైతు భరోసా పై ప్రచారం అవుతున్న అసత్య వార్తలను నమ్మవద్దు" అని వ్యవసాయశాఖ స్పష్టం చేసింది.