TG Rythu Bharosa Scheme : సాగు చేస్తేనే డబ్బులు జమ - ‘రైతు భరోసా స్కీమ్’ లో కీలక మార్పులు..!

రైతు భరోసా పథకంపై  వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. సాగు చేస్తున్న పంట భూములకు మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఈ మేరకు శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూములను గుర్తిస్తామని పేర్కొన్నారు.

Published on: Dec 25, 2025, 14:24:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పంట పెట్టుబడి సాయం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా స్కీమ్ పై ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. గతంలో మాదిరిగా కాకుండా…ఈసారి మరికొన్ని మార్పులు ఉండనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు.

రైతు భరోసా స్కీమ్
రైతు భరోసా స్కీమ్

గతంలో సాగు యోగత్య ఉన్నా రైతు భరోసా స్కీమ్ కింద నిధులు జమ చేశారు. అయితే ఈసారి మాత్రం సాగు చేస్తున్న పంట భూములకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని మంత్రి తుమ్మల ప్రకటించారు. శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూములను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు.

శాటిలైట్ ఫొటోల క్రీడకరణ పూర్తి చేసి నివేదికను వెంటనే సమర్పించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ నివేదిక వచ్చిన తర్వాతనే రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని చెప్పారు.

సాగు లేకపోతే నిధులు కట్…!

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత… పంట పెట్టుబడి సాయం స్కీమ్ లో అనేక మార్పులు తీసుకొచ్చింది. గతంలో ఉన్న రైతుబంధు పేరును రైతు భరోసా స్కీమ్ గా మార్చింది. అన్ని రకాల భూములకు కాకుండా… కేవలం సాగు యోగత్య ఉన్న భూములకే డబ్బులు చేయటం షురూ చేసింది. ఇప్పటికే ఓ సారి ఆయా రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు వేసింది. అంతేకాకుండా వందల ఎకరాలు, రియల్ ఎస్టేట్ భూముల విషయంలోనూ జాగ్రత్తలు చేపట్టింది. తాజాగా సాగు చేస్తేనే డబ్బులు జమ చేయాలని నిర్ణయించింది.

సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయంతో…. 10 లక్షల ఎకరాలలోపు భూములకు రైతు భరోసా స్కీమ్ నిధులు ఆగిపోతావని తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం మరింత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతు భరోసా అందిస్తోంది. గతంలో ఎకరానికి రూ.5 వేలు ఇచ్చేవారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More