...
...
Next Story

AIBE 22 Exam Registrations : ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ అప్డేట్ - రిజిస్ట్రేషన్లకు ఇవాళే చివరి తేదీ!

ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ (AIBE 22) దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 27న ముగియనుంది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ allindiabarexamination.com ద్వారా అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

Published on: Oct 27, 2026, 11:36:09 IST
Advertisement

న్యాయశాస్త్ర పట్టభద్రులు దేశవ్యాప్తంగా లాయర్లుగా ప్రాక్టీస్ చేయడానికి అత్యంత కీలకమైన ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ (AIBE 22) రిజిస్ట్రేషన్ల గడువు నేటితో (అక్టోబర్ 27, 2026) ముగియనుంది. ఇప్పటివరకు నమోదు చేసుకోని అభ్యర్థులు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ allindiabarexamination.com ద్వారా వెంటనే తమ వివరాలను నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.

ముఖ్యమైన తేదీల వివరాలు

AIBE 22 రిజిస్ట్రేషన్ల గడువు (Pexels/Representational Image)
AIBE 22 రిజిస్ట్రేషన్ల గడువు (Pexels/Representational Image)

దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లికేషన్ రుసుమును చెల్లించడానికి అక్టోబర్ 28, 2026 వరకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత దరఖాస్తులలో ఏవైనా పొరపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకునేందుకు ఎడిట్ విండోను అందుబాటులోకి తెస్తారు. ఈ సవరణల ప్రక్రియ అక్టోబర్ 29, 2026 నాటికి పూర్తవుతుంది.

పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను నవంబర్ 14, 2026 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని BCI ప్రకటించింది. దేశవ్యాప్తంగా AIBE 22 పరీక్షను నవంబర్ 29, 2026న నిర్వహించనున్నారు.

AIBE 22 పరీక్షకు దరఖాస్తు చేసుకునే విధానం…

ఆసక్తి కలిగిన అభ్యర్థులు కింది పద్ధతులను అనుసరించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి…..

  • మొదట AIBE అధికారిక వెబ్‌సైట్ allindiabarexamination.com ని సందర్శించాలి. హోమ్‌పేజీలో కనిపిస్తున్న 'AIBE 22 Exam New Registration' లింక్‌పై క్లిక్ చేయాలి.
  • తెరుచుకున్న కొత్త పేజీలో అడిగిన రిజిస్ట్రేషన్ వివరాలను నమోదు చేయాలి.
  • నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత లాగిన్ అవ్వాలి.
  • దరఖాస్తు ఫారమ్‌లోని వివరాలను సమగ్రంగా నింపి, నిర్ణీత రుసుమును చెల్లించాలి.'Submit' బటన్‌పై క్లిక్ చేసి, కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • భవిష్యత్తు అవసరాల కోసం ఆ కన్ఫర్మేషన్ కాపీని ప్రింట్ తీసుకుని జాగ్రత్తపరుచుకోవాలి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks