...
...
Next Story

AIIMS Bibinagar Recruitment 2026 : బీబీనగర్ ఎయిమ్స్‌లో 48 ఉద్యోగ ఖాళీలు - నోటిఫికేషన్ వివరాలు

AIIMS Bibinagar Recruitment 2026 : బీబీనగర్ ఎయిమ్స్ నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. 48 గ్రూప్-ఎ ఫ్యాకల్టీ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: Jun 8, 2026, 06:38:34 IST
Advertisement

AIIMS Bibinagar Recruitment 2026 : బీబీ నగర్‌లో ఉన్న ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ వైద్య సంస్థ, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో గ్రూప్-ఎ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తోంది. మొత్తం 48 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

ఖాళీల వివరాలు :

  • ప్రొఫెసర్: 19 పోస్టులు
  • అడిషనల్ ప్రొఫెసర్: 3 పోస్టులు
  • అసోసియేట్ ప్రొఫెసర్: 10 పోస్టులు
  • అసిస్టెంట్ ప్రొఫెసర్: 16 పోస్టులు

బీబీనగర్ ఎయిమ్స్ - ఉద్యోగ ప్రకటన
బీబీనగర్ ఎయిమ్స్ - ఉద్యోగ ప్రకటన

జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ, సైకియాట్రీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, ఆప్తాల్మాలజీ, ఈఎన్‌టీ, కార్డియాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, నెఫ్రాలజీ, న్యూరోసర్జరీ, రేడియో-డయాగ్నోసిస్, అనాస్తీషియాలజీ వంటి దాదాపు 30కి పైగా వైద్య విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

మెడికల్ అభ్యర్థులు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం కింద గుర్తింపు పొందిన ఎంబీబీఎస్‌తో పాటు సంబంధిత సబ్జెక్టులో ఎండీ/ఎంఎస్ లేదా సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో డీఎం/ఎంసీహెచ్ పూర్తి చేసి ఉండాలి. నాన్-మెడికల్ అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీతో పాటు డాక్టరేట్ (పీహెచ్‌డీ) కలిగి ఉండాలి.

దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ. 3,540 (18 శాతం జీఎస్‌టీతో కలిపి) దరఖాస్తు రుసుముగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు (PwBD), ఎక్స్-సర్వీస్‌మెన్ మరియు మహిళా అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు రుసుము లేదు. ఈ రుసుమును ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే ద్వారానే చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం…

అభ్యర్థులు ఎయిమ్స్ బీబీనగర్ అధికారిక వెబ్‌సైట్ https://aiimsbibinagar.edu.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, దరఖాస్తు ఫారమ్ ప్రింటౌట్ తీసి ప్రతి పేజీపై సంతకం చేయాలి. దానికి టెన్త్ క్లాస్ సర్టిఫికెట్, ఎంబీబీఎస్, పీజీ డిగ్రీలు, అనుభవ ధృవీకరణ పత్రాలు, కుల ధృవీకరణ పత్రాల వంటి సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ పత్రాలను జతచేయాలి. ఈ హార్డ్ కాపీలను స్పీడ్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా మాత్రమే ఎయిమ్స్ రిక్రూట్‌మెంట్ సెల్‌కు పంపాలి. కవరుపై "అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్.............." అని స్పష్టంగా రాయాలి.

  • హార్డ్ కాపీలను పంపాల్సిన చిరునామా : ది చైర్మన్, రిక్రూట్‌మెంట్ సెల్, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ Medical Sciences (AIIMS), బీబీనగర్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ (హెచ్‌ఎంఆర్), తెలంగాణ - 508126.
  • అభ్యర్థులు సమర్పించిన బయోడేటా ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. దరఖాస్తులు ఎక్కువగా వస్తే స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు, ఆ తర్వాత ఇంటర్వ్యూల ద్వారా తుది ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలు బీబీనగర్ ఎయిమ్స్ వేదికగా జరుగుతాయి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe