...
...
Next Story

AIIMS Bibinagar Recruitment : ఎయిమ్స్ బీబీనగర్‌ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ - దరఖాస్తు తేదీలివే

AIIMS Bibinagar Recruitment : ఎయిమ్స్ బీబీనగర్‌ నుంచి రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ జారీ అయింది. తాత్కాలిక ప్రాతిపదికన 32 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేస్తారు. అర్హత గల అభ్యర్థులు 2026 నవంబరు 3 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: Oct 24, 2026, 15:20:10 IST
Advertisement

ప్రతిష్టాత్మక వైద్య విద్యా సంస్థ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) బీబీనగర్ నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సీనియర్ రెసిడెంట్ (నాన్-అకాడమిక్) పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 32 ఖాళీలున్నాయి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.

ఎయిమ్స్‌ బీబీనగర్‌లో ఉద్యోగ ఖాళీలు
ఎయిమ్స్‌ బీబీనగర్‌లో ఉద్యోగ ఖాళీలు

అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా మెడికల్ కౌన్సిల్ నుంచి ఎండీ, ఎంఎస్ , డీఎన్‌బీ (DNB), డీఎం లేదా ఎంసీహెచ్ (M.Ch) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కొన్ని నిర్దిష్ట నాన్-మెడికల్ విభాగాలకు సంబంధిత సబ్జెక్టులో ఎంఎస్సీతో పాటు పీహెచ్‌డీ ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ నాటికి అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 45 ఏళ్లు మించకూడదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు మరియు దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ల వరకు వయోసడలింపు ఉంటుంది.

కేవలం ఇంటర్వ్యూనే….

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజుగా రూ. 1,770 నిర్దేశించారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మరియు మహిళా అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. నిర్ణీత బ్యాంక్ ఖాతాకు ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ప్రత్యక్ష ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఆన్‌లైన్ గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమ అసలు సర్టిఫికెట్లతో పాటు ఒక సెట్ జిరాక్స్ ప్రతులతో ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

  • ఆన్‌లైన్ (గూగుల్ ఫామ్) దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 3 (సాయంత్రం 5:00 గంటల వరకు)
  • సర్టిఫికెట్ల పరిశీలన - ఇంటర్వ్యూ తేదీలు : నవంబరు 16, 17
  • ఇంటర్వ్యూ వేదిక: అకాడమిక్ బ్లాక్, ఎయిమ్స్ బీబీనగర్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్.
  • అధికారిక వెబ్ సైట్ - https://aiimsbibinagar.edu.in

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks