ఎయిమ్స్‌ మంగళగిరిలో 76 ఉద్యోగ ఖాళీలు - కేవలం ఇంటర్వ్యూనే..!

ఏపీలోని మంగళగిరి ఎయిమ్స్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది.  పలు విభాగాల్లో సీనియర్‌ రెసిడెంట్‌/సీనియర్‌ డీమాన్‌స్ట్రేటర్స్‌ పోస్టులను భర్తీ చేస్తారు. జనవరి 2వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.

Published on: Dec 13, 2025, 16:50:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ిమంగళగిరిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్) నుంచి ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. ఇందులో భాగంగా సీనియర్‌ రెసిడెంట్‌/సీనియర్‌ డీమాన్‌స్ట్రేటర్స్‌ పోస్టులను భర్తీ చేస్తారు. అన్ని కలిపి 76 పోస్టులున్నాయి. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఫలితాలను ప్రకటిస్తారు.

ఎయిమ్స్ మంగళగిరిలో ఉద్యోగాలు
ఎయిమ్స్ మంగళగిరిలో ఉద్యోగాలు

ఈ పోస్టుల కోసం ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు జనవరి 2, 2026వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి… ఇంటర్వ్యూలకు పిలుస్తారు. మెరిట్ ఆధారంగా ఫైనల్ ఫలితాలను ప్రకటిస్తారు. ఇంటర్వ్యూలు జనవరి 6 నుంచి 8 వరకు నిర్వహిస్తారు.

ఎయిమ్స్ మంగళగిరి నోటిఫికేషన్ - ముఖ్య వివరాలు:

  • ఉద్యోగ నోటిఫికేషన్ -ఎయిమ్స్ మంగళగిరి, ఆంధ్రప్రదేశ్
  • పోస్టులు - సీనియర్‌ రెసిడెంట్‌/సీనియర్‌ డీమాన్‌స్ట్రేటర్స్‌
  • మొత్తం ఖాళీలు - 76 పోస్టులు
  • దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఎండీ/ ఎంఎస్‌/డీఎం/డీఎన్‌బీ/ఎంసీహెచ్‌, ఎంఎస్సీ/ఎంబయోటెక్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉండాలి.
  • మొత్తం 30 విభాగాల్లో ఖాళీలున్నాయి.
  • అప్లికేషన్ తేదీ చివరి నాటికి 45 ఏళ్లు మించకూడదు.
  • దరఖాస్తు రుసుం రూ. 1500(జనరల్), ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.1000
  • దరఖాస్తు విధానం - ఆన్ లైన్
  • దరఖాస్తులకు చివరి తేదీ - 2 జనవరి 2026
  • నాన్ మెడికల్ వారికి నెలకు రూ. 56,100, మెడికల్ అభ్యర్థులకు రూ.67,700 జీతం చెల్లిస్తారు.
  • ఎంపిక విధానం - ఇంటర్వ్యూలు
  • ఇంటర్వ్యూ తేదీలు - 6,8 జనవరి 2026.
  • ఇంటర్వ్యూ జరిగే ప్రాంతం - అడ్మిన్ అండ్ లైబ్రరరీ బిల్డింగ్, ఎయిమ్స్, మంగళగిరి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
  • ఉదయం 8.30 గంటలకు రిపోర్టింగ్ చేయాలి.
  • మెయిల్ - srrecruitment@aiimsmangalagiri.edu.in
  • అధికారిక వెబ్ సైట్ - https://www.aiimsmangalagiri.edu.in/
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More