ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్‌కు బిగ్‌షాక్.. పార్టీ నుంచి బహిష్కరణ

ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్‌కు బిగ్‌షాక్ తగిలింది. పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టుగా ఎంఐఎం ప్రకటించింది. అంతేకాదు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని ఆదేశించింది.

Published on: Aug 29, 2026, 10:26:15 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ రాజకీయాల్లో సంచలనాత్మక పరిణామం చోటుచేసుకుంది. ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (AIMIM) పార్టీ తమ శాసనమండలి సభ్యుడు మీర్జా రహమత్ బేగ్‌ను పార్టీ నుంచి తక్షణమే బహిష్కరిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఎంఐఎం ఎమ్మెల్సీ బహిష్కరణ
ఎంఐఎం ఎమ్మెల్సీ బహిష్కరణ

పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు అన్ని బాధ్యతల నుంచి బేగ్‌ను తొలగిస్తున్నట్లు మజ్లిస్ ప్రకటన విడుదల చేసింది. ఈ హఠాత్ పరిణామానికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఏఐఎంఐఎం తన అధికారిక ఎక్స్ ఖాతాతో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పంచుకుంది. ఈ ప్రకటన ఆధారంగా, మీర్జా రహమత్ బేగ్ తన ఎమ్మెల్సీ పదవికి వెంటనే రాజీనామా చేయాలని తెలిపింది. శాసనమండలి చైర్మన్‌కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించాలని పార్టీ నాయకత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఈ సందర్భంగా ఏఐఎంఐఎం సంయుక్త కార్యదర్శి ఎస్.ఎ. హుస్సేన్ అన్వర్ మాట్లాడుతూ.. 'మీర్జా రహమత్ బేగ్‌ను తక్షణమే అమల్లోకి వచ్చేలా ఏఐఎంఐఎం పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది. ఆయన తన ఎమ్మెల్సీ పదవికి వెంటనే తెలంగాణ శాసనమండలి చైర్మన్‌కు రాజీనామా లేఖను సమర్పించాల్సి ఉంటుంది.' అని తెలిపారు.

మజ్లిస్ అధిష్టానం ఈ కఠిన నిర్ణయానికి గల స్పష్టమైన, అధికారిక కారణాలను ప్రకటనలో నేరుగా వెల్లడించలేదు. అయితే పార్టీ ఆంతరంగిక వర్గాలు, విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రహమత్ బేగ్ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఆయన తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డారని, ఈ అంశాన్ని పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీతో సహా ఉన్నత నాయకత్వం చాలా తీవ్రంగా పరిగణించిందని సమాచారం.

పార్టీ నిబంధనలను, సిద్ధాంతాలను అతిక్రమించే ప్రజాప్రతినిధులపై ఎంతటి కఠిన చర్యలకైనా వెనుకాడబోమని ఈ నిర్ణయం ద్వారా మజ్లిస్ నాయకత్వం పార్టీ శ్రేణులకు స్పష్టమైన సంకేతాన్ని పంపింది.

హైదరాబాద్ పాతబస్తీ రాజకీయాల్లో ఏఐఎంఐఎం బలమైన పట్టు కలిగి ఉంది. పార్టీకి చెందిన ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీని ఇలా అర్ధరాత్రి సమయంలో ఉన్నపళంగా పార్టీ నుంచి తొలగించడం, రాజీనామా చేయమని కోరడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. రహమత్ బేగ్ తదుపరి అడుగు ఏంటనేది, ఆయన మండలి చైర్మన్‌కు రాజీనామా సమర్పిస్తారా లేదా అనే అంశాలపై అందరి దృష్టి నెలకొంది.

రహ్మత్ బేగ్ గురువారం ఉదయం సౌదీ అరేబియాకు వెళ్లినట్టుగా తెలుస్తోంది. అక్కడకు చేరిన తర్వాత అధిష్ఠానం నుంచి కీలక ఆదేశాలు వెళ్లాయి. దీంతో అదేరోజు సాయంత్రం ఆయన తిరిగి హైదరాబాద్‌కు రప్పించినట్టుగా తెలుస్తోంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More