...
...
Next Story

మిర్చి రైతులకు అలర్ట్.. వరంగల్ ఎనుమాముల మార్కెట్‌కు మూడు రోజులు సెలవులు!

Enumamula Mirchi Market : వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌కు పెద్ద ఎత్తున మిర్చి వస్తుంది. ధరలు కూడా భారీగా ఉన్నాయి. మరోవైపు మార్కెట్‌కు మూడు రోజులు సెలవులు వస్తున్నాయ్.

Published on: Mar 17, 2026, 11:17:38 IST
Advertisement

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ రైతులకు కీలక ప్రకటన జారీ చేసింది. మూడు రోజులపాటు మార్కెట్ బంద్ ఉండనుంది. మిర్చి, పత్తి అమ్మకాల్లో ఎనుమాముల మార్కెట్ ముందు వరుసలో ఉంటుంది. పసుపు, కందులు, పల్లివంటి పంటల విక్రయాలు కూడా జోరుగా సాగుతుంటాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటుగా.. రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడకు రైతులు వస్తుంటారు.

ఎనుమాముల మార్కెట్‌కు సెలవు
ఎనుమాముల మార్కెట్‌కు సెలవు

తాజాగా వరంగల్ ఎనుమాముల మార్కెట్ కీలక ప్రకటన జారీ చేసింది. మూడు రోజుల పాటు మార్కెట్ బంద్ కానుంది. ఈ మేరకు ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు మూడు రోజులపాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ కార్యదర్శి మల్లేశం తెలిపారు.

ఈ నెల 19,21,22 తేదీల్లో మార్కెట్‌కు సెలవు ఉండనుంది. ఈ నెల 19 ఉగాది, 21 రంజాన్, 22న వీక్లీ హాలిడే ఉంటుంది. ఈ నెల 20న మార్కెట్‌లో పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు యథావిధంగా జరుగుతాయి. రైతులు ఈ సెలువు రోజుల్లో పంట ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకురావద్దని అధికారులు సూచించారు. తర్వాత ఈ నెల 23వ తేదీన మార్కెట్ పున:ప్రారంభం అవుతుంది.

పెరిగిన మిర్చి ధరలు

మరోవైపు వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో మిర్చి ధరలు భారీగా పలుకుతున్నాయి. క్వింటాల్ ధర రూ.42,000కు చేరింది. మార్కెట్‌లోని 30 కోల్డ్ స్టోరేజీలు ఖాళీగా ఉండటం, వ్యాపారుల నుండి బలమైన డిమాండ్‌ ఉంది. డిమాండ్ పెరగడంతో, మిరప రైతులు తమ పంటను అమ్ముకోవడానికి మార్కెట్ యార్డుకు బారులు తీరుతున్నారు.

సోమవారం మార్కెట్‌కు సుమారు 52,300 బస్తాల మిరపకాయలు వచ్చాయి. సింగిల్ పట్టి(SP), దేశీ, వండర్ హాట్, దీపిక వంటి రకాలకు వ్యాపారుల నుండి అధిక డిమాండ్ ఉంది. సింగిల్ పట్టి రకం క్వింటాల్ రూ.42,000కు అమ్ముడవుతుండగా.. దేశీ రకం రూ. 41,000కు అమ్ముడవుతోంది. వండర్ హాట్ ధర క్వింటాల్‌కు రూ.35,000 కాగా.. దీపిక ధర రూ.30,000గా ఉంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks