భట్టి విక్రమార్క భార్యపై ఆరోపణలు.. విచారణ జరిపించాలని గవర్నర్‌కు రేవంత్ ఫిర్యాదు!
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్యపై ఆరోపణలు వచ్చాయి. ఆమెపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్టుగా ఓ కంప్లైంట్ కాపీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని విక్రమార్కపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్, నిలిచిపోయిన మెడికల్ బిల్లుల విడుదలకు కమిషన్లు డిమాండ్ చేస్తున్నారంటూ సామాజిక కార్యకర్త, అడ్వకేట్ కరుపోతుల రేవంత్ రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ కంప్లైంట్‌కు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో రాష్ట్ర రాజకీయంలో ఈ వ్యవహారం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.

రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకురాలు ఎస్.కె. ప్రసన్నకుమారి చేసిన ఆరోపణల ఆధారంగానే ఈ ఫిర్యాదు దాఖలు చేసినట్లు రేవంత్ స్పష్టం చేశారు. రిటైర్‌మెంట్ ప్రయోజనాల కింద రావాల్సిన సుమారు రూ. 40 లక్షల మొత్తాన్ని విడుదల చేయడానికి డిప్యూటీ సీఎం భార్య.. 10 శాతం చొప్పున రూ. 4 లక్షల కమిషన్ డిమాండ్ చేశారని ప్రసన్నకుమారి తీవ్ర ఆరోపణలు చేసినట్లు ఫిర్యాదు పత్రంలో పేర్కొన్నారు.
ఈ ఒక్క అంశమే కాకుండా, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో పెండింగ్‌లో ఉన్న దాదాపు రూ. 120 కోట్ల బిల్లుల క్లియరెన్స్ కోసం కూడా 6 శాతం నుంచి 10 శాతం వరకు కమిషన్లు వసూలు చేసేందుకు ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న వ్యక్తుల కుటుంబ సభ్యులపై ఇటువంటి తీవ్రమైన ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. ఈ విషయంపై ప్రభుత్వం గానీ, సంబంధిత వర్గాలు గానీ ఇప్పటివరకు ఎలాంటి ఖండన లేదా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
ఉద్యోగుల హక్కుల ఉల్లంఘన, ప్రభుత్వ నిధుల మళ్లింపు కోణంలో ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ జరిపించాలని ఫిర్యాదుదారు కోరారు. ఆరోపణల నిజానిజాలను తేల్చేందుకు నిర్దిష్ట సమయపరిమితిలో స్వతంత్ర, నిష్పక్షపాత విచారణ జరపాలన్నారు. పెండింగ్‌లో ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్, మెడికల్ బిల్లులకు సంబంధించిన ఫైళ్ల కదలికపై ఉన్నతాధికారులతో సమగ్ర తనిఖీ నిర్వహించాలన్నారు.
బాధితులైన రిటైర్డ్ ఉద్యోగుల స్టేట్‌మెంట్లను నమోదు చేసి, దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రేవంత్ కోరారు. ఈ ఫిర్యాదు ప్రతిని గవర్నర్‌తో పాటు అవినీతి నిరోధక శాఖ, లోకాయుక్త, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ముఖ్యమంత్రి గ్రీవెన్స్ సెల్‌కు కూడా పంపినట్లు అడ్వకేట్ రేవంత్ తెలిపారు. దీనికి సంబంధించిన కాపీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భట్టి సతీమణి పై ఫిర్యాదు బాధాకరం
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి పై ఫిర్యాదు చేయడం కుటుంబ సభ్యుల పేర్లను రాజకీయాల్లోకి తీసుకురావడం చాలా బాధాకరమని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. అయితే ఆరోపణలు ఏవైనా సరే ఈ వ్యవహారం పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


