...
...
Next Story

యూట్యూబర్ వైష్ణవి భర్త దారుణ హత్య... 'నా చెల్లిని చంపినందుకే అతడిని చంపేశా' - సోదరుడి సెల్ఫీ వీడియో

గర్భిణి అయిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో నిందితుడిగా ఉన్న చిట్యాల హరిబాబు నిజామాబాద్‌లో దారుణ హత్యకు గురయ్యాడు. అయితే ఈ హత్యను తానే చేసినట్లు వైష్ణవి సోదరుడు సెల్ఫీ వీడియో విడుదల చేశాడు.

Published on: Sep 18, 2026, 10:14:12 IST
Advertisement

గర్భవతిగా ఉన్న భార్యను దారుణంగా అంతమొందించాడనే ఆరోపణలతో అరెస్టయి, ఇటీవలె బెయిల్‌పై బయటకు వచ్చిన ఒక వ్యక్తి నిజామాబాద్ నగరంలో దారుణ హత్యకు గురయ్యాడు. నగరంలోని రాజారాజేంద్ర (ఆర్‌ఆర్‌) సెంటర్‌ వద్ద గురువారం సాయంత్రం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అతడిని వేటకొడవలితో నరికి చంపిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.

వైష్ణవి దంపతులు (ఫైల్ ఫొటో)
వైష్ణవి దంపతులు (ఫైల్ ఫొటో)

పోలీసులు అందించిన ప్రాథమిక వివరాల ప్రకారం.. నిజామాబాద్ నగరంలోని ఆర్‌ఆర్‌ చౌరస్తా వద్ద గురువారం సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో 26 ఏళ్ల చితారి హరిబాబు వెళ్తుండగా…. ఒక కారులో వచ్చిన దుండగులు అతడిని టార్గెట్ చేశారు.

"కారులో నుంచి ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులు వచ్చారు. వారిలో ఒకడు హరిబాబును వెంబడించి కొబ్బరికాయలు నరికే పెద్ద వేటకొడవలితో అతడి మెడ, తలపై తీవ్రంగా నరికాడు" అని నిజామాబాద్ ఏసీపీ బి. ప్రసాద్ వెల్లడించారు. తీవ్ర గాయాలపాలైన హరిబాబు రక్తం మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.

‘నా చెల్లెలిని చంపినందుకే చంపేశా’ - సెల్ఫీ వీడియో…

"మా చెల్లెలిని దారుణంగా చంపినందుకే నేను హరిబాబును అంతమొందించాను. మా ఇంట్లో జరిగిన విషాదం, ఆ కడుపుకోత ఇక ఏ ఇంట్లోనూ జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను," అని సంతోష్ ఆ వీడియోలో భావోద్వేగానికి గురయ్యాడు. హరిబాబును హతమార్చిన అనంతరం తాను నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోతున్నట్లు కూడా సంతోష్ ఆ వీడియోలో స్పష్టం చేశాడు.

అసలేం జరిగింది..?

ఈ ఏడాది మార్చి 17వ తేదీన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలో 'వైషు అమ్మ' పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న వైష్ణవి తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఆ సమయంలో ఆమె నాలుగు నెలల గర్భిణి. మార్చి 16 రాత్రి దంపతుల మధ్య తీవ్రమైన గొడవ జరిగిందని, ఆ కోపంలో హరిబాబు ఆమె గొంతు నులిమి, కత్తితో దాడి చేసి చంపేశాడని వైష్ణవి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు, కోరుట్ల శివార్లలో హరిబాబును అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో కట్నం వేధింపుల ఆరోపణలపై హరిబాబు తల్లి లక్ష్మి, సోదరులు ఆనంద్, అశోక్‌లపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆరు నెలల కిందట జైలుకు వెళ్లిన హరిబాబు, జులై నెలలోనే (రెండు నెలల క్రితం) బెయిల్‌పై బయటకు వచ్చాడు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks