Jagtial Youtuber Vaishnavi : యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య - గర్బవతి అని కూడా చూడకుండా కత్తితో పొడిచి చంపిన భర్త

Jagtial Youtuber Vaishnavi murder : జగిత్యాల జిల్లా కోరుట్లలో యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్యకు గురైంది. ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్తే… కత్తితో పొడిచి, గొంతు నులిమి హత్య చేశాడు.

Published on: Mar 18, 2026, 13:22:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న ఎనిమిది నెలలకే ఓ గర్భిణి భర్త చేతిలో హత్యకు గురైంది. నిందితుడు హరిబాబును అరెస్ట్ చేసిన పోలీసులు… కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

యూట్యూబర్‌ హత్య(representative image)
యూట్యూబర్‌ హత్య(representative image)

ప్రాథమిక వివరాల ప్రకారం…. కోరుట్లలోని మాదాపూర్ గ్రామానికి చెందిన యూట్యూబర్ వైష్ణవి (19)ని హరిబాబు అనే వ్యక్తి కొద్ది నెలల క్రితమే పెళ్లి చేసుకున్నాడు. వైష్ణవి ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణిగా ఉంది. ఇంతలో మంగళారం ఆమె ఇంట్లో రక్తపు మడగులో పడిపోయి ఉండటాన్ని తల్లిదండ్రులు గమనించి… పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాధితురాలి తండ్రి ఎస్ఆర్ దుర్గాప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడి చిత్తారి హరిప్రసాద్ ను అరెస్ట్ చేశారు. హరిప్రసాద్ తన భార్యను గొంతు కోసి ముఖంపై పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ జంటకు వివాహం జరిగి సుమారు పది నెలలు గడిచాయి. వైష్ణవిని భర్త హరిప్రసాద్ తో పాటు అతని తల్లి, సోదరుడు వరకట్న వేధింపులకు గురి చేశారని తండ్రి ఆరోపించారు.

ఈ కేసులో హరిప్రసాద్ ను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. అయితే అతని కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందనే ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇవాళ స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

సోషల్ మీడియా వీడియోల విషయంలో దంపతుల మధ్య తలెత్తిన వివాదమే ఈ హత్యకు కారణమని ప్రచారం జరిగుతోంది. అయితే హరిబాబు అదనపు కట్నం కోసం వైష్ణవిని వేధిస్తున్నాడని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. హరిబాబు తల్లిదండ్రులు ఈ పెళ్లికి అంగీకరించకపోవడంతో అత్తగారి ఇంట్లోనే ఉంటూ ఈ దారుణానికి ఒడిగట్టాడని చెబుతున్నారు. వైష్ణవి హత్యకు వ్యూస్ కోసం పోస్ట్ చేసిన వీడియోలు కారణమా..,,? లేక వరకట్నం కోసం వేధించి హత్య చేశాడా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More