...
...
Next Story

TG EAPCET 2026 కౌన్సెలింగ్ : రెండో విడతలో అదనంగా4 వేల బీటెక్‌ సీట్లు - వెబ్‌ ఆప్షన్లకు ఇవాళే చివరి తేదీ

TG EAPCET 2nd Phase Counselling : ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్‌లో కన్వీనర్ కోటా కింద కొత్తగా 4,347 బీటెక్ సీట్లు పెరిగాయి. మరోవైపు వెబ్ ఆప్షన్ల నమోదుకు ఆదివారం (ఈరోజు) అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే గడువు ఉంది.

Published on: Jul 19, 2026, 11:44:27 IST
Advertisement

TG EAPCET 2nd Phase Counselling : బీటెక్ చదవాలనుకునే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ రెండో విడతలో కొత్తగా మరో 4,347 బీటెక్‌ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వం వీటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రవేశాల కన్వీనర్ వీటిని కౌన్సెలింగ్‌లో చేర్చారు. కన్వీనర్, యాజమాన్య (మేనేజ్‌మెంట్) కోటాలు రెండూ కలిపితే మొత్తం 6,210 సీట్లు పెరిగినట్లయింది.

టీజీ ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్ 2026 (image source pixaby)
టీజీ ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్ 2026 (image source pixaby)

తొలివిడత కౌన్సెలింగ్‌ ముగిశాక మిగిలిన 27,487 సీట్లకు ఈ కొత్త సీట్లు కలవటంతో… రెండో విడత కౌన్సెలింగ్‌కు మొత్తం 31,834 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి అదనంగా మరో 10 శాతం (దాదాపు 430) ఈడబ్ల్యూఎస్‌ కోటా సీట్లు కూడా జరగనున్నాయి.

ముగియనున్న వెబ్ ఆప్షన్ల గడువు :

టీజీ ఈఏపీసెట్ రెండో విడత కౌన్సెలింగ్ ఈనెల 17న ప్రారంభం కాగా…. కొత్తగా 2,622 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారు. శనివారం ఉదయం ప్రారంభమైన వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియలో తొలిరోజే 27,197 మంది విద్యార్థులు తమ ఆప్షన్లను నమోదు చేసుకున్నారు. ఈ వెబ్‌ఆప్షన్ల గడువు ఆదివారం అర్ధరాత్రి 12 గంటలతో ముగియనుంది. కాబట్టి అర్హులైన విద్యార్థులు… వెంటనే వెబ్ ఆప్షన్ల ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.

వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే విధానం..

  • ముందుగా అధికారిక కౌన్సెలింగ్ పోర్టల్ https://tgeapcet.nic.in ను సందర్శించండి.
  • హోంపేజీలో ఉన్న 'Candidate Login' ఆప్షన్‌పై క్లిక్ చేసి, మీ ఈఏపీసెట్ హాట్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్, పుట్టిన తేదీ, క్యాప్చా వివరాలను ఎంటర్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే OTP ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
  • మీరు ఏ ఏ జిల్లాల్లో సీటు పొందాలనుకుంటున్నారో ఆ జిల్లాలను ఎంపిక చేసుకోండి. అనంతరం ఆయా జిల్లాల్లో అందుబాటులో ఉన్న కాలేజీలు, మీకు కావలసిన బ్రాంచ్‌ల కోడ్‌లను ప్రాధాన్యత క్రమంలో
  • మీరు ఎంచుకున్న ఆప్షన్లను ఎప్పటికప్పుడు సేవ్ ఆప్షన్ ద్వారా సేవ్ చేయాలి. లేదంటే మళ్లీ మెుదటి నుంచి చేయాల్సి రావొచ్చు. జూలై 19 లోగా మీ ఆప్షన్లను ఖరారు చేస్తూ Freeze చేయాలి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe