TS DOST 2026 Counseling : డిగ్రీ విద్యార్థులకు అలర్ట్ - దోస్త్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, ముఖ్య తేదీలు

TS DOST 2026 Special Phase  Counseling : డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి తెలంగాణ విద్యాశాఖ మరో అప్డేట్ ఇచ్చింది. ఇప్పటికే కౌన్సెలింగ్ ముగియగా… తాజాగా స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 

Published on: Jul 18, 2026, 15:16:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

TS DOST 2026 Special Phase Counseling : రాష్ట్రంలో డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరాలనుకునే విద్యార్థులకు ప్రభుత్వం మరో అవకాశాన్ని కల్పించింది. డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST) అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా 'ప్రత్యేక విడత' కౌన్సెలింగ్‌కు ఉన్నత విద్యామండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అర్హులైన విద్యార్థులు.. జూలై 20, 2026 నుండి జూలై 26, 2026 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

దోస్త్ అడ్మిషన్లు
దోస్త్ అడ్మిషన్లు

దోస్త్ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ - ముఖ్య తేదీలు :

  • నూతన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ (రూ. 400/- ఫీజుతో) : జూలై 20, 2026 నుండి జూలై 26, 2026 వరకు.
  • వెబ్ ఆప్షన్ల నమోదు : జూలై 20, 2026 నుంచి జూలై 27, 2026 వరకు అవకాశం ఉంటుంది.
  • ప్రత్యేక కేటగిరీ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ (PH/CAP/NCC/Sports/Extra-Curricular): జూలై 27, 2026 న యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్లలో జరుగుతుంది.
  • ప్రత్యేక విడత సీట్ల కేటాయింపు : జూలై 30, 2026.
  • ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ : జూలై 30, 2026 నుండి ఆగస్టు 01, 2026 వరకు.
  • కళాశాలల్లో ఒరిజినల్ సర్టిఫికెట్ల సమర్పణ : ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్న విద్యార్థులు తమ ఒరిజినల్ టీసీ , ఇతర ధృవీకరణ పత్రాలను జూలై 31, 2026 నుండి ఆగస్టు 01, 2026 లోపు సంబంధిత కళాశాలలో సమర్పించాల్సి ఉంటుంది.
  • రిపోర్టింగ్ చేయకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు. కాబట్టి ఈ ఫేజ్ లో సీట్లు పొందే విద్యార్థులు తప్పనిసరిగా రిపోర్టింగ్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

ఇంతవరకు దోస్త్ అడ్మిషన్లలో అసలు రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులు, గత మూడు విడతలలో దరఖాస్తు చేయని వారు ఈ ప్రత్యేక విడతలో కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులవుతారు. గతంలో దోస్త్ ఐడీ పొంది, ఏ విడతలోనూ సీటు సాధించలేకపోయిన విద్యార్థులు తమ పాత ఐడీ , పిన్ ద్వారా నేరుగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.

గత విడతలలో సీటు వచ్చి… నచ్చని కళాశాలలో చేరిన వారు ఇప్పుడు కొత్తగా వేరే కళాశాలకు మారాలనుకుంటే ఈ ప్రత్యేక విడత ద్వారా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. విద్యార్థులు సీటు పొందే అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి వీలైనన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్లను ఇవ్వాలని అధికారులు సూచించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More