AP DME Recruitment : 234 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల - దరఖాస్తు తేదీలివే

AP DME Recruitment 2026 : ఏపీ వైద్యారోగ్య శాఖ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. 234 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. 

Published on: Jul 16, 2026, 14:16:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య విద్యా విభాగం (DME) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీ చేయనున్నారు. బ్రాడ్, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఈ నియామకాలు చేపట్టనున్నారు.

234 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
234 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం మొత్తం 234 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అయితే ఈ ఖాళీల సంఖ్య తాత్కాలికం మాత్రమేనని అధికారులు స్పష్టం చేశారు. అవసరాలను బట్టి ఈ పోస్టుల సంఖ్య పెరిగే లేదా తగ్గే అవకాశం ఉంటుంది.

అర్హతలు….

  • ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) నిబంధనల ప్రకారం అర్హతలు కలిగి ఉండాలి.
  • సంబంధిత స్పెషాలిటీ విభాగంలో పీజీ డిగ్రీ (MD/MS) లేదా దానికి సమానమైన అర్హత కలిగి ఉండాలి.
  • నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ గుర్తించిన, 500 లేదా అంతకంటే ఎక్కువ పడకల సామర్థ్యం ఉన్న ఆసుపత్రి అనుబంధ వైద్య సంస్థల నుంచి బ్రాడ్ స్పెషాలిటీస్ లో డిఎన్‌బి (DNB) పూర్తి చేసిన వారు కూడా అర్హులు. వీరు మెడికల్ ఇన్‌స్టిట్యూషన్స్ రెగ్యులేషన్స్-2022 నిబంధనలకు లోబడి ఉండాలి.
  • అభ్యర్థులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉండాలి.

నోటిఫికేషన్ విడుదలైన తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 44 సంవత్సరాలు దాటకూడదు. అయితే అనాటమీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్ వంటి ప్రీ-క్లినికల్ మరియు పారా-క్లినికల్ సబ్జెక్టుల అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిని 50 సంవత్సరాలుగా నిర్ణయించారు.

ఈ నియామకాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన స్థానిక అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఏపీ రిజిస్ట్రేషన్ ఉండి, ఒకవేళ స్థానిక అభ్యర్థులు అందుబాటులో లేకపోతేనే నాన్-లోకల్ అభ్యర్థులను పరిశీలిస్తారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ నుంచి ఏపీకి వలస వచ్చిన వారు రెవెన్యూ అధికారుల నుంచి పొందిన నివాస ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.

ఎంపికైన అభ్యర్థులకు బ్రాడ్ స్పెషాలిటీల విభాగంలో నెలకు రూ. 80,500 గౌరవ వేతనం (Honorarium) చెల్లిస్తారు. ఈ పోస్టులు పూర్తిగా ఏడాది కాలపరిమితితో కూడిన కాంట్రాక్ట్/టెన్యూర్‌ పద్ధతిలో ఉంటాయి. ఎంపికైన వారు ఖచ్చితంగా ఒక సంవత్సరం పాటు సేవలు అందించాల్సి ఉంటుంది. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ మోడ్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

  • దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా
  • దరఖాస్తు చివరి తేదీ: జులై 19, 2026
  • అధికారిక వెబ్ సైట్ - https://www.dme.ap.nic.in/
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More