Telangana : వైద్యారోగ్యశాఖ నుంచి శుభవార్త - TIMS సనత్‌నగర్‌లో 240 ఉద్యోగాలు, నోటిఫికేషన్ విడుదల
TIMS Hyderabad Recruitment : తెలంగాణ వైద్యారోగ్య శాఖ నుంచి మరో శుభవార్త వచ్చేసింది. సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న 240 మెడికల్, అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
TIMS Hyderabad Recruitment 2026 :రాష్ట్రంలో వైద్యశాఖలోని కొలువుల భర్తీకి మరో నోటిఫికేషన్ వెలువడింది. సనత్‌నగర్ లోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) ఆసుపత్రిలో పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన ఒప్పంద విధానం (Contract) లేదా గౌరవ వేతన (Honorarium) పద్ధతిలో నియామకాలు చేపడతారు. ఎంపికైన అభ్యర్థులు 31.03.2027 వరకు లేదా రెగ్యులర్ పోస్టుల భర్తీ పూర్తయ్యే వరకు విధుల్లో కొనసాగుతారు. అర్హులైన అభ్యర్థులు జూలై 22లోపు దరఖాస్తు చేసుకోవాలి. జూలై 30వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు. https://dme.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
ఖాళీల వివరాలు ఇవే:
- మెడికల్ ఆఫీసర్: 144 పోస్టులు
- ఫార్మసిస్ట్ గ్రేడ్-II: 14 పోస్టులు
- ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II: 48 పోస్టులు
- ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-I: 12 పోస్టులు
- మెడికో సోషల్ వర్కర్ గ్రేడ్-II: 6 పోస్టులు
- జూనియర్ అసిస్టెంట్: 16 పోస్టులు
ఉండాల్సిన అర్హతలు…
- మెడికల్ ఆఫీసర్: ఎంబీబీఎస్ (MBBS) లేదా దానికి సమానమైన అర్హత ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
- ఫార్మసిస్ట్ గ్రేడ్-II: ఇంటర్మీడియట్ పూర్తి చేసి, గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి డి.ఫార్మసీ లేదా బి.ఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి. తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
- ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II: డిఎమ్‌ఎల్‌టి (DMLT) లేదా బిఎస్సీ ఎమ్‌ఎల్‌టి (B.Sc MLT) లేదా ఇంటర్ వోకేషనల్ ఎమ్‌ఎల్‌టి పూర్తి చేయాలి. అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏడాది అప్రెంటిస్‌షిప్ చేసి ఉండాలి. TGPMB లో రిజిస్టర్ కావాలి. గతంలో ప్రభుత్వంలో కాంట్రాక్ట్ లేదా ఔట్‌సోర్సింగ్ చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు.
- ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-I: పైన పేర్కొన్న అర్హతలతో పాటు 220 లేదా అంతకంటే ఎక్కువ పడకల ఆసుపత్రిలో 5 ఏళ్ల పని అనుభవం, NABL మార్గదర్శకాలపై అవగాహన ఉండాలి.
- మెడికో సోషల్ వర్కర్ గ్రేడ్-II: యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ (MSW) తో పాటు మెడికల్ సోషల్ వర్క్ లేదా పబ్లిక్ హెల్త్ సర్వీసెస్‌లో 3 ఏళ్ల అనుభవం అవసరం.
- జూనియర్ అసిస్టెంట్: గుర్తింపు పొందిన డిగ్రీతో పాటు కంప్యూటర్ అప్లికేషన్ నాలెడ్జ్ ఉండాలి లేదా కంప్యూటర్ సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు హైదరాబాద్ జిల్లా స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 45 ఏళ్లుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, బీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు తమ పాత సంస్థల నుండి రిలీవింగ్ ఆర్డర్ సమర్పించాల్సి ఉంటుంది. ఈ తాత్కాలిక నియామకం భవిష్యత్తులో రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగానికి ఎటువంటి హక్కును కల్పించదు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

