ఏపీలో కొత్తగా మరో 175 ఎంబీబీఎస్ సీట్లకు ఎన్‌ఎంసీ అనుమతి!
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రవేశం కోరుకునే విద్యార్థులకు శుభవార్త అందింది. పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాల, విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాలలో మొత్తం 175 ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి అనుమతి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు జాతీయ వైద్య కమిషన్(NMC) తీపి కబురు అందించింది. పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాల, విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలల్లో కలిపి మొత్తం 175 ఎంబీబీఎస్(MBBS) సీట్ల భర్తీకి ఎన్‌ఎమ్‌సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో ఈ ఏడాది కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 325కు చేరింది.

ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కేంద్రం నుంచి వచ్చిన తాజా అనుమతుల ప్రకారం సీట్లు ఇలా ఉన్నాయి. పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాల 2026-27 విద్యా సంవత్సరం నుండి కొత్తగా 100 ఎంబీబీఎస్ సీట్లలో ప్రవేశాలు కల్పించేందుకు ఎన్‌ఎమ్‌సీ అనుమతి ఇచ్చింది. సిద్ధార్థ వైద్య కళాశాల(విజయవాడ)కు అదనంగా మరో 75 ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేసింది. దీనికి సంబంధించిన అనుమతి పత్రాలను ఎన్‌ఎమ్‌సీ విడుదల చేసింది.
ఇటీవలే కడప, నెల్లూరు, పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అదనపు సీట్లకు ఎన్‌ఎమ్‌సీ అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మంజూరైన 175 సీట్లతో కలిపి ఈ ఒక్క ఏడాదిలోనే రికార్డు స్థాయిలో 325 కొత్త ఎంబీబీఎస్ సీట్లు ప్రభుత్వ రంగంలో అదనంగా అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నేరుగా ఢిల్లీ వెళ్లి ఎన్‌ఎమ్‌సీ ఉన్నతాధికారులతో జరిపిన చర్చలు ఫలించడంతోనే ఈ అదనపు సీట్లు మంజూరయ్యాయని అధికారిక ప్రకటన పేర్కొంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 505 కొత్త ఎంబీబీఎస్ సీట్లు అదనంగా తోడయ్యాయి. ఈ పరిణామంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. 'ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు పెరగడం వల్ల ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రైవేట్ వైద్య కళాశాలల్లో లక్షల రూపాయలు వెచ్చించి చదవాల్సిన అవసరం తప్పుతుంది. గతంలో స్వల్ప ర్యాంకుల తేడాతో ప్రభుత్వ సీటు కోల్పోయిన మెరిట్ విద్యార్థులకు ఇప్పుడు డాక్టర్ అయ్యే సువర్ణావకాశం లభిస్తుంది.' అని సత్యకుమార్ పేర్కొన్నారు.
తాజా అదనపు సీట్ల కేటాయింపుతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 7,090కి చేరుకుంది. ఇది వైద్య విద్యను అభ్యసించాలనుకునే రాష్ట్ర విద్యార్థులకు ఒక గొప్ప వరమనే చెప్పాలి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


