టీజీ ఈఏపీసెట్ 2026 సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ ప్రారంభం.. స్టెప్ బై స్టెప్ గైడ్!
TG EAPCET 2026 : టీజీ ఈఏపీసెట్ 2026 సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియ నడుస్తోంది. విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి.
తెలంగాణలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఈఏపీసెట్ (TG EAPCET 2026) రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. తొలి విడత సీట్ల కేటాయింపు తర్వాత మిగిలిపోయిన సుమారు 27,487 సీట్ల భర్తీకి తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TGCHE) ఈ కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తోంది. మొదటి విడతలో సీటు రాని వారు, సీటు వచ్చినా నచ్చని వారు, మెరుగైన కాలేజీల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు ఈ రెండో విడతలో పాల్గొనవచ్చు.

వెబ్ ఆప్షన్ల ముఖ్యమైన తేదీలు
వెబ్ ఆప్షన్ల నమోదు: జూలై 18 నుండి జూలై 19, 2026 వరకు.
ఆప్షన్ల ఫ్రీజింగ్ : జూలై 19, 2026.
రెండో విడత సీట్ల కేటాయింపు: జూలై 22, 2026 లేదా అంతకంటే ముందు చేస్తారు.
ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ : జూలై 22 నుంచి 24 వరకు.
కాలేజీల్లో డైరెక్ట్ రిపోర్టింగ్ : జూలై 25 నుంచి 28 వరకు.
వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే విధానం
కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యార్థులు ఎలాంటి తప్పులు లేకుండా వెబ్ ఆప్షన్లు పెట్టుకోవడానికి కింది విధానాన్ని అనుసరించాలి.
ముందుగా అధికారిక కౌన్సెలింగ్ పోర్టల్ https://tgeapcet.nic.in ను సందర్శించండి.
హోమ్‌పేజీలో ఉన్న 'Candidate Login' ఆప్షన్‌పై క్లిక్ చేసి, మీ ఈఏపీసెట్ హాట్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్, పుట్టిన తేదీ, క్యాప్చా వివరాలను ఎంటర్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే OTP ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
మీరు ఏ ఏ జిల్లాల్లో సీటు పొందాలనుకుంటున్నారో ఆ జిల్లాలను ఎంపిక చేసుకోండి. అనంతరం ఆయా జిల్లాల్లో అందుబాటులో ఉన్న కాలేజీలు, మీకు కావలసిన బ్రాంచ్‌ల కోడ్‌లను ప్రాధాన్యత క్రమంలో
మీరు ఎంచుకున్న ఆప్షన్లను ఎప్పటికప్పుడు సేవ్ ఆప్షన్ ద్వారా సేవ్ చేయాలి. లేదంటే మళ్లీ మెుదటి నుంచి చేయాల్సి రావొచ్చు. జూలై 19 లోగా మీ ఆప్షన్లను ఖరారు చేస్తూ Freeze చేయాలి.
రెండో విడతలో వెబ్ ఆప్షన్లు కొత్తగా ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మొదటి విడతలో పెట్టిన ఆప్షన్లు ఈ విడతలో పరిగణనలోకి తీసుకోరు. రెండో విడత సీట్ల కేటాయింపు జూలై 22, 2026 నుంచి ఉంటుంది. ఆన్‌లైన్ ట్యూషన్ ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ జూలై 22 నుండి జూలై 24 వరకు చేయాలి. అలాట్ అయిన కాలేజీలో ఫిజికల్ రిపోర్టింగ్ జూలై 25 నుండి జూలై 28, 2026 మధ్య ఉంటుంది. సీటు రద్దు చేసుకునేందుకు చివరి తేదీ జూలై 28, 2026గా నిర్ణయించారు. విద్యార్థులు తమకు నచ్చిన కోర్సు లేదా కాలేజీ వచ్చే వరకు ఎక్కువ సంఖ్యలో ఆప్షన్లు ఇచ్చుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


