...
...
Next Story

తెలంగాణకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ - రేపటి నుంచే ప్రారంభం, ఆగే స్టేషన్లు ఇవే…

తెలుగు ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త అందించింది. హైదరాబాద్ లోని చర్లపల్లి నుంచి ఏపీ, తమిళనాడు మీదుగా తిరువనంతపురం వరకు అమృత్ భారత్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలును ప్రవేశపెట్టింది.

Published on: Jan 22, 2026, 15:42:23 IST
Advertisement

తెలంగాణకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణికులకు సేవలందించనుంది. 23 జనవరి 2026న దేశవ్యాప్తంగా నాలుగు అమృత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేరళలోని తిరువనంతపురం నుంచి ఈ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు.

మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్

తిరువనంతపురం నుంచి చర్లపల్లి వరకు ఈ అమృత భారత్ రైలు నడవనుంది. ఇప్పటికే చర్లపల్లి-ముజఫర్ పూర్ (బిహార్) మధ్య ఒక అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ సేవలందిస్తుండగా…. ఇది తెలంగాణ రాష్ట్రానికి ఇది రెండోది. ఎక్కువదూరం ప్రయాణించే రైలు రూట్లలో.. ప్రయాణికులకు మరింత సులభతరమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందించే దిశగా ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకతను చాటుకుంటోంది.

ఈ రైలు ప్రతి మంగళవారం 17041 నెంబరుతో ఈ నడిచే రైలు ఉదయం చర్లపల్లి నుంచి ఉదయం 7.15కు బయలుదేరి.. మరుసటి రోజు (బుధవారం) మధ్యాహ్నం 2.45కు తిరువనంతపురం చేరుకుంటుంది. అక్కడినుంచి 17042 నెంబరుతో గురువారం రాత్రి 11.30కు బయలుదేరి.. శనివారం సాయంత్రం 5.30 గంటలకు చర్లపల్లికి చేరుకోనుంది.

ఆగే స్టేషన్లు….

తెలంగాణలోని నల్గొండ, మిర్యాలగూడ, ఆంధ్రప్రదేశ్‌లోని సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట.. తమిళనాడులోని తిరుత్తణి, కటపాడి,జోలార్ పెట్టయ్, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్.. కేరళలోని పాలక్కాడ్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, చంగన్‌సెర్రీ, తిరువల్ల, చెంగనూర్, మావెలికర, కాయంకుళం, కరునాగపల్లి, కొల్లాం, వర్కాల శివగిరి మీదుగా తిరువనంతపురం చేరుకుంటుంది.

ఆధునిక వసతులు…

ప్రయాణికుల అవసరాలకు తగ్గట్లుగా.. ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఆధునిక పద్ధతుల్లో, స్వదేశీ సాంకేతికతతో డిజైన్ చేశారు. అందుబాటు ధరలకే.. వివిధ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. సుదూరమైన రూట్లలో.. ప్రయాణించే వారికి నాన్-ఏసీ ప్రయాణాన్ని సౌకర్యవంతమైన వసతులను అందించనున్నారు.

ఈ రైలులో ప్రయాణికులకోసం ఫోల్డబుల్ స్నాక్స్ టేబుల్స్, మొబైల్ మరియు బాటిల్ హోల్డర్స్, రాత్రివేళల్లో బోగీలో దారి సరిగ్గా కనిపించేలా రేడియం ఫ్లోర్ స్ట్రిప్స్, సౌకర్యవంతమైన సీటింగ్/స్లీపింగ్ ఏర్పాట్లు, ఎలక్ట్రో-న్యుమాటిక్ ఫ్లషింగ్ తో కూడిన మాడ్రన్ టాయిలెట్స్, మంటలను వెంటనే అదుపులోకి తీసుకొచ్చే వ్యవస్థ, దివ్యాంగులకోసం ప్రత్యేక ఏర్పాట్లు, స్పీడ్ చార్జింగ్ పాయింట్స్, పాంట్రీ కార్ వంటి వసతులు ఉండనున్నాయి.

తెలంగాణకు మరో అమృత్ భారత్ రైలును కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మశుక్రవారం తిరువనంతపురం నుంచి చర్లపల్లికి వచ్చే అమృత్ భారత్‌ ఎక్స్‌ప్రెస్ రైలు.. రేపు 02029 నెంబరుతో నడవనుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks