సంచలనం సృష్టించిన ఐబొమ్మ రవి కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. వెల్లేల ప్రహ్లాద్ అనే వ్యక్తి పేరుతో రవి, పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు. విచారణ చేస్తుంటే.. అతడు తన రూమ్‌మేట్ అని.. అందుకే ఆ పేరును వాడుకున్నట్టుగా వెల్లడించాడు. ప్రహ్లాద్ గురించి పోలీసులు ఆరా తీశారు.

బెంగళూరు నుంచి ప్రహ్లాద్‌ను పిలిపించారు. కస్టడీలో ఉన్న ఐబొమ్మ రవి ముందుగానే ప్రహ్లాద్‌ను విచారణ చేశారు. దీంతో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. నిజానికి ఐబొమ్మ రవి, ప్రహ్లాద్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఇదే విషయాన్ని ప్రహ్లాద్ తెలిపాడు. రవి ఎవరో తనకు తెలియదని, తన పేరుతో పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్టుగా తెలిసి షాక్ అయ్యానని చెప్పాడు ప్రహ్లాద్. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న అతడి డాక్యుమెంట్స్‌ను ఐబొమ్మ రవి దొంగిలించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు డిసెంబర్ 29వ తేదీతో రవి పోలీస్ కస్టడీ ముగియనుంది.
కరేబియన్ దీవుల్లో ఉంటూ.. ఐబొమ్మ పైరసీ సైట్‌ను రన్ చేశాడు ఇమంది రవి. గతంలో చాలాసార్లు పోలీసులకు సవాల్ విసిరాడు. పూర్తిగా అక్కడే సెటిల్ కావాలి అనుకున్నాడు. కానీ హైదరాబాద్ వచ్చిన అతడు పోలీసులకు చిక్కాడు. పోలీసులు కూకట్‌పల్లిలోని గ్రీన్ హిల్స్ రోడ్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో అతన్ని అరెస్టు చేశారు. విచారణ చేస్తుంటే అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దర్యాప్తు అధికారులు రవి కదలికలను వారాల తరబడి ట్రాక్ చేశారు. అతని ఫోన్ నంబర్లను గుర్తించి, అతనిపై నిఘా పెట్టే ముందు అతని పరిచయాల గురించి కూడా తెలుసుకున్నారు. రవితోనే ఐబొమ్మ సైట్లను క్లోజ్ చేయించారు. అయితే అదే పేరుతో ఉన్నట్టుగా మార్కెట్లోకి ఇప్పుడు కొన్ని సైట్లు వచ్చాయి.
విశాఖపట్నానికి చెదిన ఇమంది రవి ఐబొమ్మ పైరసీలో ప్రధాన నిందితుడు. ఇప్పటికే పలుసార్లు పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేశారు. స్వాధీనం చేసుకున్న హార్డ్ డ్రైవ్‌లలో అనేక భాషలలో దాదాపు 21,000 సినిమాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. సుమారు రూ.20 కోట్లు సంపాదించాడని వార్తలు వచ్చాయి. దర్యాప్తు సమయంలో అతని బ్యాంకు ఖాతాల్లోని సుమారు రూ.3.5 కోట్లను సీజ్ చేశారు.
{{/usCountry}}విశాఖపట్నానికి చెదిన ఇమంది రవి ఐబొమ్మ పైరసీలో ప్రధాన నిందితుడు. ఇప్పటికే పలుసార్లు పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేశారు. స్వాధీనం చేసుకున్న హార్డ్ డ్రైవ్‌లలో అనేక భాషలలో దాదాపు 21,000 సినిమాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. సుమారు రూ.20 కోట్లు సంపాదించాడని వార్తలు వచ్చాయి. దర్యాప్తు సమయంలో అతని బ్యాంకు ఖాతాల్లోని సుమారు రూ.3.5 కోట్లను సీజ్ చేశారు.
{{/usCountry}}పైరసీ వెబ్‌సైట్ నుంచి సినిమాలను రికార్డింగ్ చేసినట్టుగా పోలీసులకు రవి తెలిపాడు. ఓటీటీలో వచ్చే సినిమాలను కూడా రికార్డింగ్ చేసినట్టుగా అంగీకరించాడు. ఆ ఆడియోలు, వీడియోల క్వాలిటీ పెంచేందుకు ఔట్ సోర్సింగ్ వారితో ఒప్పందం చేసుకున్నట్టుగా రవి వెల్లడించాడు. పైరసీ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ గురించి చెప్పాడు. ఐబొమ్మ పూర్తిపేరు ఇంటర్నేట్ బొమ్మగా.., విశాఖలో సినిమాను బొమ్మగా పిలిచేవాళ్లమని, అందుకే ఆ పేరు పెట్టినట్టుగా రవి క్లారిటీ ఇచ్చాడు.