ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ - ఎగ్జామ్ ఫీజు చెల్లింపునకు కొన్ని గంటలే గడువు..! ఇదే లాస్ట్ ఛాన్స్

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల ఫీజును స్వీకరిస్తున్నారు.అయితే రూ. 1000 ఫైన్ తో కూడా ఇవాళ గడువు పూర్తి కానుంది. ఇంకా ఏవరైనా చెల్లించకపోతే వెంటనే ఫీజు చెల్లించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Published on: Nov 6, 2025, 13:57:07 IST
By , Andhrapradesh
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా అక్టోబర్ 31వ తేదీతో గడువు ముగిసింది. ప్రస్తుతం రూ. 1000 ఫైన్ తో ఫీజులను స్వీకరిస్తున్నారు. అయితే ఈ సమయం కూడా దగ్గరపడింది. అర్హులైన విద్యార్థులు ఇవాళ(నవంబర్ 6) ఫీజు చెల్లించుకోవచ్చు. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించిన నేపథ్యంలో మరోసారి గడువు పొడించే అవకాశం లేదు.

ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్
ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్

ఫీజుల వివరాలు ఇలా….

ఏపీ ఇంటర్ పరీక్షల ఫీజుల వివరాలు చూస్తే… జనరల్ లేదా వొకేషనన్ కోర్సుల థియరీ పరీక్షలకు రూ.600గా ఉంది. ప్రాక్టికల్స్‌కు జనరల్ కోర్సులు(సెకండ్ ఇయర్), వొకేషనల్(ఫస్ట్, సెకండ్ ఇయర్) విద్యార్థులకు రూ.275గా నిర్ణయించారు. జనరల్, వొకేషనల్ బ్రిడ్జి కోర్సులకు రూ.165 కాగా, వొకేషనల్ బ్రిడ్జ్ కోర్సు ప్రాక్టికల్స్(సెకండ్ ఇయర్) రూ.275గా ఉంది.

ఫస్ట్, సెకండ్ ఇయర్ రెండూ కలిపి థియరీ పరీక్షలు ఉంటే రూ.1200గా నిర్ణయించారు. వొకేషనల్ కోర్సుల ప్రాక్టికల్స్ రూ.550, జనరల్, వొకేషనల్ బ్రిడ్జ్ కోర్సు సబ్జెక్ట్స్ రూ.330గా ఉంది. ఫస్ట్, ఇయర్ సెకండర్ ఇయర్ పాస్ అయి రీ అపియరింగ్ కోసం ఆర్ట్స్ రూ.1350, సైన్స్ రూ.1600గా ఫీజులు ఉన్నాయి.

పరీక్షలు ఎప్పుడంటే…?

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ కూడా వచ్చేసింది. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఈ ఎగ్జామ్స్ షురూ అవుతాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు పరీక్షల తేదీలను ప్రకటించింది.

వచ్చే ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానుండగా… ఫిబ్రవరి 24వ తేదీ నుంచి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి. మార్చి 24వ తేదీ నాటికి అన్ని పరీక్షలు పూర్తి కానున్నాయి.

ఇక ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జనవరి 23వ తేదీన నిర్వహిస్తారు. సెకండియర్ విద్యార్థుల ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. 10వ తేదీతో ముగుస్తాయి. ఈ పరీక్షలు పూర్తి అయ్యాక… హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకువస్తారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More