...
...
Next Story

సంక్రాంతికి ఇంటికి వెళ్తున్నారా? దక్షిణ మధ్య రైల్వే నుంచి కీలక అప్డేట్, డిస్కౌంట్ కూడా!

సంక్రాంతి పండుగ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్స్ ఇచ్చింది. ప్రత్యేక రైళ్లకు హాల్ట్‌లను ఏర్పాటు చేసింది. అంతేకాదు ప్రయాణికులు డిస్కౌంట్ కూడా పొందేందుకు ఛాన్స్ ఉంది.

Published on: Jan 6, 2026, 14:33:22 IST
Advertisement

సంక్రాంతి దగ్గరకు వచ్చింది. ఇక ఊర్లకు వెళ్లేందుకు జనాలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఆర్టీసీ కూడా స్పెషల్ బస్సులను నడిపిస్తోంది. సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని.. హైదరాబాద్ నగరంలో ఉండేవారికి సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.

దక్షిణ మధ్య రైల్వే
దక్షిణ మధ్య రైల్వే

సికింద్రాబాద్, లింగంపల్లి నుంచి నడిచే 16 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హైటెక్ సిటీ స్టేషన్‌లో, సికింద్రాబాద్ టూ విజయవాడ మార్గంలో నడిచే మరో 11 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు చర్లపల్లిలో ప్రత్యేకంగా హాల్ట్‌లను ఏర్పాటు చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే. ఈ సదుపాయం ఈ నెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. దీంతో సంక్రాంతికి ఇంటికి వెళ్లేవారికి, తిరిగి వచ్చేవారికి స్పెషల్ ట్రైన్స్ ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

హైటెక్ సిటీలో 16 రైళ్లు

హైటెక్ సిటీలో మచిలీపట్నం-బీదర్ ఎక్స్‌ప్రెస్, నర్సాపూర్-లింగంపల్లి ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి-విశాఖపట్నం జన్మభూమి, కాకినాడ టౌన్-లింగంపల్లి గౌతమి, సాయినగర్‌- మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌, సాయినగర్‌- కాకినాడ ఎక్స్‌ప్రెస్‌, విశాఖపట్నం- ముంబయి ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌, మచిలీపట్నం- సాయినగర్‌, కాకినాడ- సాయినగర్‌ షిర్డీ ఎక్స్‌ప్రెస్‌, లింగంపల్లి- కాకినాడ ఎక్స్‌ప్రెస్‌, విశాఖపట్నం- లింగంపల్లి జన్మభూమి, ముంబయి- విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌, లింగంపల్లి- కాకినాడ గౌతమి ఎక్స్‌ప్రెస్‌, లింగంపల్లి- నర్సాపుర్‌ ఎక్స్‌ప్రెస్‌, బీదర్‌- మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్లకు హాల్ట్ ఉంది.

చర్లపల్లిలో 11 రైళ్లు

ఇక చర్లపల్లిలోనూ పలు రైళ్లకు హాల్ట్ ఉంటుంది. అవి సికింద్రాబాద్‌ - గూడూరు - సికింద్రాబాద్‌ సింహపురి, కాకినాడ - లింగంపల్లి - కాకినాడ గౌతమి, కాకినాడ - లింగంపల్లి - కాకినాడ కాకినాడ ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్‌ - విశాఖపట్నం- సికింద్రాబాద్‌ గరీబ్‌రథ్‌, సికింద్రాబాద్‌ - భువనేశ్వర్‌ విశాఖ, హైదరాబాద్‌ - విశాఖపట్నం గోదావరి, తిరుపతి - సికింద్రాబాద్‌ - తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లు 20వ తేదీ దాకా చర్లపల్లి స్టేషన్‌లో ఆగుతాయి. హైదరాబాద్‌లో ఉండేవారు ఈ సర్వీసులను ఉపయోగించుకోవచ్చు.

రైల్‌వన్ యాప్ డిస్కౌంట్

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks