...
...
Next Story

Army Public School Recruitment : ఆర్మీ పబ్లిక్ స్కూల్ సికింద్రాబాద్‌లో ఉద్యోగాలు - రాత పరీక్ష లేకుండానే భర్తీ,

Army Public School Secunderabad Recruitment 2026 : సికింద్రాబాద్ ఆర్కే పురంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో వైస్ ప్రిన్సిపాల్, హెడ్ మిస్ట్రెస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు జులై 25, 2026 నాటికి ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Published on: Jul 22, 2026, 11:35:54 IST
Advertisement

Army Public School Secunderabad Recruitment 2026 : సికింద్రాబాద్‌లోని ఆర్కే పురం ఆర్మీ పబ్లిక్ స్కూల్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. 2026-27 అకాడమిక్ సంవత్సరానికి గానూ ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో వైస్ ప్రిన్సిపాల్, హెడ్ మిస్ట్రెస్ ఖాళీలున్నాయి.

ముఖ్యమైన వివరాలు

  • నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2 పోస్టులను భర్తీ చేయనున్నారు.
  • వైస్ ప్రిన్సిపాల్ : 01 పోస్టు
  • హెడ్ మిస్ట్రెస్ : 01 పోస్టు
  • ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ (AWES), సీబీఎస్‌ఈ (CBSE) నిబంధనల ప్రకారం అర్హత ప్రమాణాలను నిర్ణయించారు.
  • వైస్ ప్రిన్సిపాల్ : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత బోధనా సబ్జెక్టులో రెగ్యులర్ మాస్టర్స్ డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. వీటితో పాటు సీటెట్ (CTET), సీఎస్‌బీ (CSB/OST) లలో అర్హత సాధించాలి. గుర్తింపు పొందిన సీబీఎస్‌ఈ పాఠశాలలో పిజిటి (PGT)గా కనీసం 6 ఏళ్ల అనుభవం లేదా పిజిటి/టిజిటిగా కలిపి 10 ఏళ్ల అనుభవం (ఇందులో కనీసం 3 ఏళ్లు పిజిటిగా ఉండాలి) తప్పనిసరి. దాంతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం (MS Office, Power Point) ఉండాలి.
  • హెడ్ మిస్ట్రెస్ : కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, బీఈడీ / ఎంఈడీ / బీఈఐఈడీ / డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పాసై ఉండాలి. సీటెట్ (CTET), సీఎస్‌బీ (CSB/OST) లలో అర్హత సాధించడమే కాకుండా, కనీసం 8 ఏళ్ల బోధనా అనుభవం (ఇందులో 5 ఏళ్లు సీబీఎస్‌ఈ స్కూల్లో పీఆర్‌టీగా) ఉండాలి. ఐటీ/కంప్యూటర్ పరిజ్ఞానం ఉండడం అవసరం.
  • ఏప్రిల్ 1, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 35 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ వర్కింగ్ స్టాఫ్, మాజీ సైనికోద్యోగులకు (ESM) గరిష్ట వయోపరిమితిలో నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ప్రాసెస్ ఇలా….

ఆర్మీ పబ్లిక్ స్కూల్ సికింద్రాబాద్‌లో ఉద్యోగాలు
ఆర్మీ పబ్లిక్ స్కూల్ సికింద్రాబాద్‌లో ఉద్యోగాలు

అభ్యర్థులు రూ.250 దరఖాస్తు రుసుమును 'Army Public School RK Puram' పేరిట తీసిన డిమాండ్ డ్రాఫ్ట్ (DD) రూపంలో దరఖాస్తు ఫారానికి జతచేయాలి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ (www.apsrkpuram.edu.in) నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. పూర్తి చేసిన దరఖాస్తు ఫారానికి విద్యార్హతల సర్టిఫికెట్లు, అనుభవ ధ్రువీకరణ పత్రాలు, స్కోర్ కార్డ్, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులు మరియు డీడీ జత చేసి అంచె ద్వారా గానీ లేదా స్వయంగా గానీ కింది చిరునామాకు సమర్పించాలి.

  • దరఖాస్తులు పంపాల్సిన చిరునామా : ది ప్రిన్సిపాల్, ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్కే పురం, సికింద్రాబాద్ - 500056.
  • దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ : జులై 25, 2026
  • ఈమెయిల్ ద్వారా పంపిన దరఖాస్తులను, అసంపూర్తిగా ఉన్న ఫారాలను తిరస్కరిస్తారు. దరఖాస్తుల పరిశీలన (Scrutiny) అనంతరం షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను మాత్రమే ఇంటర్వ్యూకి పిలుస్తారు.
  • అధికారిక వెబ్ సైట్ - https://apsrkpuram.edu.in/

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks