హైదరాబాద్: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వ్యవహరిస్తున్న తీరుపై ఏఐఎమ్ఐఎమ్ (AIMIM) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈసీ రాజ్యాంగబద్ధంగా ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, నిర్ణయాలు ఏకగ్రీవంగా జరుగుతున్నాయా లేక భిన్నాభిప్రాయాలు ఉన్నాయా అనే విషయాలు బయటకు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియతో పాటు చట్టబద్ధమైన నమూనా ఫారమ్‌లలో చేసిన మార్పులపై సుప్రీంకోర్టులో పిటిషన్‌తో పాటు రివ్యూ పిటిషన్‌ను కూడా దాఖలు చేసినట్లు బుధవారం విలేకరుల సమావేశంలో ఒవైసీ వెల్లడించారు.
ఎస్ఐఆర్పై సుప్రీంకోర్టులో పోరాటం

గతంలో బీహార్ ఎస్ఐఆర్ వ్యవహారంలోనూ తాము పిటిషనర్‌గా ఉన్నామని ఒవైసీ గుర్తుచేశారు. "ఎస్ఐఆర్ ప్రక్రియకు అనుకూలంగా అత్యున్నత న్యాయస్థానం గతంలో తీర్పు ఇచ్చినప్పటికీ, ఈ ప్రక్రియలో సరైన పారదర్శకత లేకపోవడంతో రివ్యూ పిటిషన్ దాఖలు చేశాం. ఓటర్ల నమోదు ఫారమ్‌లలో ఎందుకు మార్పులు చేశారో స్పష్టమైన సమాచారం లేదు" అని ఆయన వివరించారు. ఎస్ఐఆర్ నమోదు సమయంలో తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌లలో ప్రజలకు సహాయం చేయడానికి తమ పార్టీ ఒక ప్రత్యేక యాప్‌ను రూపొందించిందని, ఏ ఇతర రాజకీయ పార్టీ కూడా తమ స్థాయిలో క్షేత్రస్థాయిలో పనిచేయలేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
యూపీ ఎన్నికల్లో పొత్తుకు సిద్ధం
ఉత్తరప్రదేశ్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల గురించి ఒవైసీ మాట్లాడుతూ, సమాజ్‌వాదీ పార్టీతో పాటు ఇతర ప్రతిపక్షాలతో పొత్తు చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. "బీజేపీని నిరోధించాలనుకుంటే మాతో కలసి మాట్లాడండి. కూటమిగా ఏర్పడి పోరాడదాం" అని పిలుపునిచ్చారు. 2029 ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఘోర పరాజయం తప్పదన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. హైదరాబాద్‌లో అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ ప్రచారం చేసినా ఎంఐఎం విజయాన్ని అడ్డుకోలేకపోయారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ద్వంద్వ నీతిపై ధ్వజమెత్తు
కాంగ్రెస్ పార్టీ వైఖరిపై ఒవైసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో తెలంగాణలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో తమ మద్దతు కోరిన కాంగ్రెస్, ఢిల్లీ లేదా ఇతర ప్రాంతాల్లో ఎంఐఎంను దూరం పెట్టడాన్ని తప్పుపట్టారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే అనర్హత వేటుకు గురవడంతో అక్కడ జరగనున్న ఉపఎన్నికను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ వైఖరిపై ప్రశ్నలు కురిపించారు. ఎస్ఐఆర్ నిరసనలను కొందరు ఎలైట్ క్లబ్‌లా మార్చుకుంటున్నారని, ఏ ఒక్క పార్టీకి ఈ అంశంపై పేటెంట్ హక్కులు లేవని స్పష్టం చేశారు.
ఎలాన్ మస్క్‌పై మండిపాటు.. జంతర్ మంతర్ ధర్నాలపై వ్యాఖ్యలు
{{/usCountry}}కాంగ్రెస్ పార్టీ వైఖరిపై ఒవైసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో తెలంగాణలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో తమ మద్దతు కోరిన కాంగ్రెస్, ఢిల్లీ లేదా ఇతర ప్రాంతాల్లో ఎంఐఎంను దూరం పెట్టడాన్ని తప్పుపట్టారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే అనర్హత వేటుకు గురవడంతో అక్కడ జరగనున్న ఉపఎన్నికను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ వైఖరిపై ప్రశ్నలు కురిపించారు. ఎస్ఐఆర్ నిరసనలను కొందరు ఎలైట్ క్లబ్‌లా మార్చుకుంటున్నారని, ఏ ఒక్క పార్టీకి ఈ అంశంపై పేటెంట్ హక్కులు లేవని స్పష్టం చేశారు.
ఎలాన్ మస్క్‌పై మండిపాటు.. జంతర్ మంతర్ ధర్నాలపై వ్యాఖ్యలు
{{/usCountry}}శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల విషయంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తీరును ఒవైసీ తప్పుపట్టారు. భారతదేశంలో ప్రపంచంలోనే అత్యంత చౌకైన డేటా ఛార్జీలు ఉన్నాయని, తెల్ల జాతీయులు భారత్‌కు నిబంధనలు నిర్దేశించడమేంటని ప్రశ్నించారు. ప్రధాని మోదీ కఠిన వైఖరితో మస్క్‌కు "బై-బై" చెప్పాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్‌ను నిరసన ప్రాంతాల జాబితా నుంచి తొలగించడాన్ని ఒవైసీ విమర్శించారు. హింస లేనంత వరకు శాంతియుత నిరసనలకు అనుమతి ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇటీవల సీజేపీ (CJP) నేతల అరెస్టును ఖండిస్తూ, వారికి పోలీసు స్టేషన్లోనే బెయిల్ లేదా నోటీసు ఇస్తే సరిపోయేదని అభిప్రాయపడ్డారు.