తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన ఘటనకు సంబంధించి ఆడియో వైరల్ అయింది. నిజామాబాద్ జిల్లా న్యాల్కల్‌లో భర్త దాయిని ప్రశాంత్(35)కు భార్య సంధ్య హార్పిక్ ఎక్కించి చంపిన విషయం తెలిసిందే. భర్తకు మద్యం తాగించిన వెంకటసాయి అలియాస్ బంటితో సంధ్య మాట్లాడిన కాల్ రికార్డ్ బయటకొచ్చింది. ఇందులో తన భర్త అస్సలు లేవకుండా తాగించాలని పదే పదే చెబుతోంది సంధ్య.

భర్త ప్రశాంత్, వెంకటసాయి పక్క పక్కన ఉండగానే సంధ్య కాల్ చేసింది. వెంకటసాయితో మాట్లాడుతూ.. నువ్ ఏం చేస్తావో తెలియదు. నా భర్తకు అతిగా మద్యం తాగించు అని చెప్పడం ఆడియోలో ఉంది. ఏం చేస్తావో తెలియదు.. నా భర్త మెుత్తం మందు తాగేసి పైననే పడుకోవాలి. అస్సలు కిందకు రావొద్దు.. కొంచెం ఉండగానే ఇంకా మందు తెప్పించు. మెుత్తం తాగించు అంటూ వెంకటసాయికి చెప్పింది సంధ్య. నీకు వచ్చిన సమస్యకు నాకేందుకు బాధ అంటూ వెంకటసాయి ఆడియోలో చెబుతున్నాడు. అంతేకాదు నీ భర్తకు మద్యం తాగిస్తుంటే.. నాకు కూడా పోస్తున్నాడు అంటూ వెంకటసాయి మద్యం మత్తులో సంధ్యతో మాట్లాడాడు. ఇప్పుడు ఈ ఆడియో వైరల్ అయింది.
అసలు ఏం జరిగిందంటే?
న్యాల్కల్‌కు చెందిన ప్రశాంత్ అనే వ్యక్తి కుటుంబ పోషణ కోసం గల్ఫ్ దేశానికి వెళ్లాడు. భర్త దూరంగా ఉన్న సమయంలో అతడి భార్య సంధ్య.. అనిల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కష్టపడి సంపాదిస్తూ భార్య, పిల్లల భవిష్యత్తు కోసం కలలు కన్న ప్రశాంత్, ఇటీవలె గల్ఫ్ నుండి స్వగ్రామానికి వచ్చాడు.
భర్త రాక సంధ్యకు నచ్చలేదు. తన ఎఫైర్‌కు అడ్డుగా మారాడనే కక్షను పెంచుకుంది సంధ్య. పరాయి వ్యక్తి వ్యామోహంలో మునిగిపోయిన ఆమె, కన్నబిడ్డల భవిష్యత్తును కూడా మరిచి కట్టుకున్నవాడిని వదిలించుకోవాలని ఒక కఠినమైన ప్లాన్ వేసింది. తన ప్లాన్‌ను అమలు చేయడానికి స్థానికుడైన వెంకట సాయి అలియాస్ బంటి అనే వ్యక్తి సహాయం తీసుకుంది.
{{/usCountry}}భర్త రాక సంధ్యకు నచ్చలేదు. తన ఎఫైర్‌కు అడ్డుగా మారాడనే కక్షను పెంచుకుంది సంధ్య. పరాయి వ్యక్తి వ్యామోహంలో మునిగిపోయిన ఆమె, కన్నబిడ్డల భవిష్యత్తును కూడా మరిచి కట్టుకున్నవాడిని వదిలించుకోవాలని ఒక కఠినమైన ప్లాన్ వేసింది. తన ప్లాన్‌ను అమలు చేయడానికి స్థానికుడైన వెంకట సాయి అలియాస్ బంటి అనే వ్యక్తి సహాయం తీసుకుంది.
{{/usCountry}}పక్కా స్కెచ్ ప్రకారం మొదట ప్రశాంత్‌తో బంటి కలిసి మద్యం సేవించాడు. ఇదే సమయంలో వెంకటసాయితో మధ్యమధ్యలో సంధ్య ఫోన్ కాల్ మాట్లాడింది. ప్రశాంత్ పూర్తి మత్తులోకి జారుకోగానే.. మేడపై నుండి కిందకు తోసేశారు. కింద పడటంతో ప్రశాంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఏమీ తెలియనట్లు నటిస్తూ భర్తను మొదట ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించింది.
అంతటితో ఆగకుండా భర్త ఎలాగైనా చంపాలని.. టాయిలెట్ క్లీనర్‌గా వాడే హార్పిక్ లిక్విడ్‌ను సిరంజి ద్వారా భర్త నరాల్లోకి ఎక్కించింది. ఆ రసాయనంతో ప్రశాంత్ తల్లడిల్లిపోతూ ప్రాణాలు విడిచాడు. మొదట ఇదొక ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా అందరూ భావించారు. కానీ ప్రశాంత్ మృతిపై అనుమానాలు రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేపట్టారు. నిందితుడు వెంకట సాయి అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం చెప్పేశాడు. ఇదంతా సంధ్య ప్లాన్ అని ఒప్పుకున్నాడు. మరోవైపు పోలీసులు కూడా సంధ్యకు గతంలో నర్స్‌గా పని చేసిన అనుభవం ఉన్నట్టుగా వెల్లడించారు. అలా నరాల్లోకి హార్పిక్ ఎక్కించే ప్లాన్ వేసిందన్నారు.