నా మెుగుడు లేవకుండా తాగిపించు.. హార్పిక్‌ ఎక్కించి చంపిన భార్య ఆడియో వైరల్!

నిజామాబాద్ జిల్లా న్యాల్కల్ గ్రామంలో భర్తకు భార్య టాయిలెట్ క్లీనర్ అయిన హార్పిక్ ఎక్కించి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటటనలో వెంకటసాయి అనే వ్యక్తితో భార్య మాట్లాడిన ఆడియో బయటకు వచ్చింది.

Published on: Jul 7, 2026, 11:14:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన ఘటనకు సంబంధించి ఆడియో వైరల్ అయింది. నిజామాబాద్ జిల్లా న్యాల్కల్‌లో భర్త దాయిని ప్రశాంత్(35)‌కు భార్య సంధ్య హార్పిక్ ఎక్కించి చంపిన విషయం తెలిసిందే. భర్తకు మద్యం తాగించిన వెంకటసాయి అలియాస్ బంటితో సంధ్య మాట్లాడిన కాల్ రికార్డ్ బయటకొచ్చింది. ఇందులో తన భర్త అస్సలు లేవకుండా తాగించాలని పదే పదే చెబుతోంది సంధ్య.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

భర్త ప్రశాంత్, వెంకటసాయి పక్క పక్కన ఉండగానే సంధ్య కాల్ చేసింది. వెంకటసాయితో మాట్లాడుతూ.. నువ్ ఏం చేస్తావో తెలియదు. నా భర్తకు అతిగా మద్యం తాగించు అని చెప్పడం ఆడియోలో ఉంది. ఏం చేస్తావో తెలియదు.. నా భర్త మెుత్తం మందు తాగేసి పైననే పడుకోవాలి. అస్సలు కిందకు రావొద్దు.. కొంచెం ఉండగానే ఇంకా మందు తెప్పించు. మెుత్తం తాగించు అంటూ వెంకటసాయికి చెప్పింది సంధ్య. నీకు వచ్చిన సమస్యకు నాకేందుకు బాధ అంటూ వెంకటసాయి ఆడియోలో చెబుతున్నాడు. అంతేకాదు నీ భర్తకు మద్యం తాగిస్తుంటే.. నాకు కూడా పోస్తున్నాడు అంటూ వెంకటసాయి మద్యం మత్తులో సంధ్యతో మాట్లాడాడు. ఇప్పుడు ఈ ఆడియో వైరల్ అయింది.

అసలు ఏం జరిగిందంటే?

న్యాల్కల్‌కు చెందిన ప్రశాంత్ అనే వ్యక్తి కుటుంబ పోషణ కోసం గల్ఫ్ దేశానికి వెళ్లాడు. భర్త దూరంగా ఉన్న సమయంలో అతడి భార్య సంధ్య.. అనిల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కష్టపడి సంపాదిస్తూ భార్య, పిల్లల భవిష్యత్తు కోసం కలలు కన్న ప్రశాంత్, ఇటీవలె గల్ఫ్ నుండి స్వగ్రామానికి వచ్చాడు.

భర్త రాక సంధ్యకు నచ్చలేదు. తన ఎఫైర్‌కు అడ్డుగా మారాడనే కక్షను పెంచుకుంది సంధ్య. పరాయి వ్యక్తి వ్యామోహంలో మునిగిపోయిన ఆమె, కన్నబిడ్డల భవిష్యత్తును కూడా మరిచి కట్టుకున్నవాడిని వదిలించుకోవాలని ఒక కఠినమైన ప్లాన్ వేసింది. తన ప్లాన్‌ను అమలు చేయడానికి స్థానికుడైన వెంకట సాయి అలియాస్ బంటి అనే వ్యక్తి సహాయం తీసుకుంది.

పక్కా స్కెచ్ ప్రకారం మొదట ప్రశాంత్‌తో బంటి కలిసి మద్యం సేవించాడు. ఇదే సమయంలో వెంకటసాయితో మధ్యమధ్యలో సంధ్య ఫోన్ కాల్ మాట్లాడింది. ప్రశాంత్ పూర్తి మత్తులోకి జారుకోగానే.. మేడపై నుండి కిందకు తోసేశారు. కింద పడటంతో ప్రశాంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఏమీ తెలియనట్లు నటిస్తూ భర్తను మొదట ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించింది.

అంతటితో ఆగకుండా భర్త ఎలాగైనా చంపాలని.. టాయిలెట్ క్లీనర్‌గా వాడే హార్పిక్ లిక్విడ్‌ను సిరంజి ద్వారా భర్త నరాల్లోకి ఎక్కించింది. ఆ రసాయనంతో ప్రశాంత్ తల్లడిల్లిపోతూ ప్రాణాలు విడిచాడు. మొదట ఇదొక ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా అందరూ భావించారు. కానీ ప్రశాంత్ మృతిపై అనుమానాలు రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేపట్టారు. నిందితుడు వెంకట సాయి అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం చెప్పేశాడు. ఇదంతా సంధ్య ప్లాన్ అని ఒప్పుకున్నాడు. మరోవైపు పోలీసులు కూడా సంధ్యకు గతంలో నర్స్‌గా పని చేసిన అనుభవం ఉన్నట్టుగా వెల్లడించారు. అలా నరాల్లోకి హార్పిక్ ఎక్కించే ప్లాన్ వేసిందన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More