...
...
Next Story

మంత్రిగా అజారుద్దీన్‌....! కేబినెట్‌ విస్తరణకు ముహూర్తం ఖరారు, ఈసీకి ఫిర్యాదు...!

తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహుర్తం ఫిక్స్ అయింది. రేపు(అక్టోబర్ 31) మధ్యాహ్నం 12.15 గంటలకు రాజ్‌భవన్‌లో మహమ్మద్‌ అజారుద్దీన్‌ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Published on: Oct 30, 2025, 18:39:36 IST
Advertisement

తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహుర్తం ఫిక్స్ అయింది. ఇందులో భాగంగా మాజీ క్రికెటర్ మహమ్మద్‌ అజారుద్దీన్‌ కు చోటు ఖరారైంది. ఈ మేరకు ప్రమాణస్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లును ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.

మధ్యాహ్నం 12.15 నిమిషాలకు…

తెలంగాణ కేబినెట్ విస్తరణ
తెలంగాణ కేబినెట్ విస్తరణ

శుక్రవారం (అక్టోబర్ 31) మధ్యాహ్నం 12.15 నిమిషాలకు రాజ్ భవన్‌లో కేబినెట్ విస్తరణ ఉంటుంది. కొత్త మంత్రిగా అజారుద్దీన్‌ ప్రమాణస్వీకారం చేస్తారు. ఇప్పటికే ఆయనతో పాటు సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. ప్రమాణ స్వీకారానికి సీటింగ్, తదితర అంశాలపై కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రస్తుత కేబినెట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా 15 మంది సభ్యులు ఉన్నారు. నిబంధనల ప్రకారం మంత్రివర్గంలో మరో ముగ్గురు సభ్యులకు ఇంకా అవకాశం ఉంది. అజారుద్దీన్ ప్రమాణస్వీకారం చేస్తే మరో రెండింటిని భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు కేబినెట్ లో మైనారీవర్గాలకు చెందిన మంత్రి లేరు. విస్తరణలో తప్పకుండా మైనార్టీ కోటా నుంచి ఒకరికి ఛాన్స్ ఇవ్వాలనే అభిప్రాయాలు ఎప్పట్నుంచే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే…. అజారుదీన్ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇందుకు ఏఐసీసీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో… ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే అజారుద్దీన్ తో పాటు ఇంకా ఏవరైనా ప్రమాణం చేస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరుగుతోంది. ఇక్కడ భారీ సంఖ్యలో ముస్లిం ఓటర్లు ఉన్నారు. వీరి ఓట్ల ఆధారంగా గెలుపోటములు డిసైడ్ అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. అయితే ఇక్కడ గెలవటం అధికార కాంగ్రెస్ కు అతిపెద్ద సవాల్ గా మారింది. పైగా బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ ఇచ్చింది. దీంతో ముస్లింల ఓట్లు ఏటువైపు ఉంటాయన్న ఆందోళన కూడా ఉంది. అయితే అజారుదీన్ కు కేబినెట్ లోకి తీసుకోవటం వల్ల పార్టీకి లాభం చేకూరవచ్చన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.అజారుదీన్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తే… రేవంత్ కేబినెట్ లో మైనార్టీ వర్గానికి కూడా అవకాశం లభించినట్లు అవుతుంది.

గత ఆగస్టులో తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ కోటా కింద అజారుద్దీన్ ను శాసనమండలి (ఎమ్మెల్సీ) సభ్యుడిగా నామినేట్ చేసింది. అయితే గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఇంకా ఈ నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

2023 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచే అజారుద్దీన్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కూడా ఆయన టికెట్ ఆశించారు. కానీ చివరికి నవీన్ యాదవ్ కు టికెట్ ఖరారైంది. అయితే ఆయనకు కేబినెట్ చోటు కల్పించటంపై హామీ ఇవ్వటంతో… వెనక్కి తగ్గారనే చర్చ కూడా వినిపించింది.

ఈసీకి ఫిర్యాదు:

అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిందని తెలిపింది. ఈ ఫిర్యాదులపై ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks