జూబ్లీహిల్స్ ఉపఎన్నిక : 81 నామినేషన్లకు గ్రీన్ సిగ్నల్ - విత్ డ్రా కు రేపు అవకాశం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. స్క్రూటినీ అనంతరం 81 మంది అభ్యర్థుల 135 నామినేషన్లను మాత్రమే ఖరారయ్యాయి. షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 24గా ఉంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు దాఖలైన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తి అయింది. మొత్తం 211 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 211 మంది అభ్యర్థులు దాఖలు చేసిన 321 నామినేషన్లను ఎన్నికల అధికారులు బుధవారం స్క్రూటినీ చేశారు. పరిశీలన తర్వాత… 81 మంది అభ్యర్థులు దాఖలు చేసిన 135 నామినేషన్లకు మాత్రమే రిటర్నింగ్ అధికారి ఆమోదం తెలిపారు. 130 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించబడ్డాయి.

నవంబర్ 11న పోలింగ్….
211 మంది అభ్యర్థులు మొత్తం 321 నామినేషన్లు దాఖలు చేయగా… వారిలో కొందరు రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. బుధవారం ప్రారంభమైన నామినేషన్ పత్రాల పరిశీలనలో 81 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించగా…. 130 మంది అభ్యర్థులను తిరస్కరించినట్లు అధికారిక ప్రకటనలో అధికారులు పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 24గా ఉంది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది.
ఈ ఏడాది జూన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గుండెపోటుతో మరణించడంతో ఈ ఉప ఎన్నిక తప్పనిసరి అనివార్యమైంది. వి.నవీన్ యాదవ్ ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించగా, ప్రతిపక్ష బీఆర్ఎస్ దివంగత ఎమ్మెల్యే భార్య మాగంటి సునీతను బరిలోకి దింపింది. బీజేపీ లంకల దీపక్ రెడ్డిని ఎంపిక చేసింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు పార్టీ మద్దతు ఇస్తామని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు.
సున్నితమైన పోలింగ్ స్టేషన్ల విషయంలో ఈసీ ముందస్తు చర్యలు చేపడుతోంది. జీపీఎస్ ఆధారిత పర్యవేక్షణను అమలు చేయనుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

