తెలంగాణలో కొనసాగుతున్న బంద్ - డిపోలకే పరిమితమైన బస్సులు, బడులు కూడా మూసివేత..!
రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాల తెలంగాణ బంద్ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే రోడ్లపైన నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. పలు యూనివర్శిటీ పరిధిలో జరుగుతున్న పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల డిమాండ్ పై బీసీ జేఏసీ చేపట్టిన రాష్ట్రవ్యాప్ద బంద్ కొనసాగుతోంది. ఈ బంద్ కు అన్ని పార్టీలతో పాటు అనేక ప్రజా, విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. అన్ని పార్టీల నేతలు ఎక్కడికక్కడ బంద్ లో పాల్గొంటున్నారు. ఇవాళ తెల్లవారుజాము నుంచే బంద్ కార్యక్రమాలు మొదలయ్యాయి.

బంద్‌కు మద్దతుగా పలు ప్రాంతాల్లో బీసీ సంఘాలు నిరనస చేపట్టాయి. జిల్లా కేంద్రాల్లోని ఆర్టీసీ డిపోల ముందు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా ఎక్కడికక్కడ నేతలు అడ్డుకుంటున్నారు. దీంతో హైదరాబాద్ నగరమే కాకుండా జిల్లాల్లో కూడా బస్సులన్నీ డిపోలకే పరిమితయ్యాయి.
వ్యాపార, విద్యాసంస్థలు బంద్…!
బీసీ సంఘాల బంద్ నేపథ్యంలో పలు వ్యాపార సంస్థలు స్వచ్ఛద్ధంగా మూసివేసి మద్దతు ప్రకటించాయి. ఇక పలు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్య సంఘాలు కూడా ఇవాళ బడులను మూసివేస్తున్నట్లు ముందుగానే ప్రకటించాయి. దీంతో చాలా స్కూళ్లు తెరుచుకోలేదు.
బీసీ బంద్ నేపథ్యంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో జరగాల్సిన ఎల్‌ఎల్‌బీ, బీటెక్, ఎమ్మెస్సీ 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ (బయోటెక్నాలజీ అండ్ కెమిస్ట్రీ), ఎంటెక్, సి.ఎల్ .ఐ .ఎస్ .సి (దూరవిద్య) పరీక్షలను వాయిదా పడ్డాయి. త్వరలోనే కొత్త తేదీలను ప్రకటించనున్నారు. ఇక ఓయూ పరిధిలో జరుగుతున్న పలు పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. మిగతా అన్ని పరీక్షలు యథావిధిగా షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని ఆయా యూనివర్శిటీల అధికారులు స్పష్టం చేశారు.
మరోవైపు దీపావళి పండగ ఉండటంతో చాలా మంది ఊర్లల్లోకి వెళ్తున్నారు. అయితే ఇవాళ బంద్ కొనసాగుతుండగా… ప్రయాణీకులపై బంద్ ప్రభావం తీవ్రంగా పడింది. దీంతో, సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు రైళ్ల రాకపోకలు, మెట్రో, ఎంఎంటీఎస్ సేవలు కొనసాగుతుండగా… రద్దీ ఎక్కువగానే ఉంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

