దీపావళి ధమాకా! ఈ బెస్ట్ సెల్లింగ్, ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్స్..
శాంసంగ్ గెలాక్సీ ఎస్24, పోకో ఎఫ్ 7 వంటి కొన్ని ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్స్‌పై అదిరిపోయే దీపావళి డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. మీరు కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇదే రైట్ టైమ్! పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
దీపావళి 2025 పండుగ దగ్గర పడింది! ఈ పండుగ సీజన్‌లో మీరు ఇప్పటికే చాలా షాపింగ్ చేసి ఉంటారు. అయితే, మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తూ, ఇప్పటికీ ఫెస్టివల్ సేల్స్‌లో దేనినీ ఎంచుకోనట్లయితే.. ఇప్పుడు కూడా ఇంకా టైమ్ ఉంది. ఎందుకంటే, కొన్ని ఫోన్‌లు ఇంకా చాలా మంచి డిస్కౌంట్ ధరలకు అమ్ముడవుతున్నాయి. శాంసంగ్, వన్‌ప్లస్ వంటి ప్రముఖ కంపెనీల ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లపై ఆకర్షణీయమైన ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి.

ప్రస్తుతం తక్కువ ధరకు లభిస్తున్న టాప్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ల వివరాలను ఇక్కడ చూసేయండి..
శాంసంగ్ గెలాక్సీ ఎస్24..
స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌తో వచ్చిన శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఫోన్ ఇప్పటికీ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 39,999 ధరకే అమ్ముడవుతోంది. ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ లేదా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ వంటి బ్యాంక్ ఆఫర్‌లను జోడిస్తే దీని ధర మరింత తగ్గే అవకాశం ఉంది! ఈ ధరతో, మీరు ట్రిపుల్ కెమెరా సెటప్, శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌ను (ఇది స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ కంటే ముందు వచ్చిన ఫ్లాగ్‌షిప్ చిప్), కాంపాక్ట్‌గా ఉండే 6.2 ఇంచ్ డిస్‌ప్లేను పొందుతారు. మంచి ఫ్లాగ్‌షిప్ ఎక్స్‌పీరియెన్స్ కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.
వన్‌ప్లస్ 13ఎస్..
దీపావళి సందర్భంగా మంచి ధరలో లభిస్తున్న మరో ఫ్లాగ్‌షిప్ ఫోన్ వన్‌ప్లస్ 13ఎస్. సాధారణంగా ఈ ఫోన్ రూ. 54,999కి అమ్ముడవుతుండగా, ప్రస్తుతం రూ. 50,999కి అందుబాటులో ఉంది. దీనికి బ్యాంక్ ఆఫర్‌లను వర్తింపజేస్తే, ధర మరింత తగ్గే అవకాశం ఉంది. వన్‌ప్లస్ నుంచి వచ్చిన ఈ గ్యాడ్జెట్ ఒక శక్తివంతమైన, కాంపాక్ట్ మోడల్! భవిష్యత్తులో రాబోయే వన్‌ప్లస్ 15 ఫ్లాగ్‌షిప్‌కు సైతం వన్‌ప్లస్ తీసుకురానున్న కొత్త డిజైన్ లాంగ్వేజ్‌లో ఈ ఫోన్ మొదటిది కావడం విశేషం.
నథింగ్ ఫోన్ 3..
ఇటీవలి సేల్స్‌లో నథింగ్ ఫోన్ 3 ధర భారీగా తగ్గింది. కొనుగోలుదారులు దీనిని రూ. 27,000 వరకు కూడా కొనుగోలు చేయగలిగారు. అయినప్పటికీ ఆ సమయంలో చాలా ఆర్డర్‌లు రద్దు అయ్యాయి. అదలా ఉంచితే, దీని అసలు ధర రూ. 80,000 కాగా, ప్రస్తుతం రూ. 30,000 కూపన్, రూ. 10,000 బ్యాంక్ ఆఫర్‌తో కలిపితే, కేవలం రూ. 40,000కే లభిస్తోంది. మార్కెట్‌లో ఉన్న మిగతా ఫోన్‌ల కంటే భిన్నంగా, ప్రత్యేకంగా కనిపించే ఫోన్‌ను మీరు కోరుకుంటున్నట్లయితే, ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగిన నథింగ్ ఫోన్ 3 మంచి కొనుగోలు కావచ్చు.
పోకో ఎఫ్7..
పోకో ఎఫ్7 స్మార్ట్‌ఫోన్ బేస్ మోడల్ ఇప్పటికీ రూ. 30,999కి అమ్ముడవుతూనే ఉంది. బ్యాంక్ ఆఫర్‌లను కలిపితే, దీని ధరను రూ. 30,000 కంటే తక్కువకే పొందవచ్చు. అధిక ధర పెట్టకుండానే, అన్ని పనులు చేసే ఒక ఫోన్ కావాలనుకునే వారికి, ఈ ధర వద్ద పోకో ఎఫ్7 అద్భుతమైన విలువను అందిస్తుంది. ఇది పెద్ద 7,500ఎంఏహెచ్ బ్యాటరీ, శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 4 చిప్‌సెట్, 12 జీబీ ర్యామ్, ప్రీమియం మెటల్, గ్లాస్ డిజైన్‌తో వస్తుంది. అయితే, ఈ ఫోన్ కొంచెం బరువుగా ఉంటుంది, కాబట్టి ఆ విషయంలో మీరు అడ్జెస్ట్ అవ్వాల్సి ఉంటుంది.
మరి మీరు ఏ స్మార్ట్‌ఫోన్‌ని కొంటున్నారు?














