బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో నిందితుడు పరారీలో ఉండగా, బాధితురాలైన మైనర్ బాలిక తల్లి తొలిసారిగా నోరు విప్పారు. తమకు జరిగిన అన్యాయం, ఎదురైన బెదిరింపులు, వ్యవస్థల నిర్లక్ష్యంపై ఆమె ఒక వివరణాత్మక ప్రకటన విడుదల చేశారు.
పరిచయం పేరుతో వల.. మాయమాటలతో అఘాయిత్యం

2025లో బండి భగీరథ్‌తో తన కుమార్తెకు పరిచయం ఏర్పడిందని బాధితురాలి తల్లి తెలిపారు. మొదట్లో సాధారణంగా సాగిన ఈ పరిచయం, ఆ తర్వాత భగీరథ్ పదేపదే ఫోన్లు చేయడం, ప్రలోభాలకు గురిచేయడంతో అది మానసిక ఒత్తిడికి దారితీసింది. మైనర్ అని కూడా చూడకుండా తన కుమార్తెను పూర్తిగా తన నియంత్రణలోకి తెచ్చుకున్నాడని ఆమె ఆరోపించారు.
"నా కుమార్తెకు ఇష్టం లేకపోయినా, ఆమె తీవ్రంగా ప్రతిఘటించినా భగీరథ్ పదేపదే శారీరక సంబంధం కోసం ఒత్తిడి తెచ్చేవాడు" అని ఆమె వాపోయారు. ముఖ్యంగా 2025 డిసెంబర్ 31వ తేదీ రాత్రి, కొత్త సంవత్సరం వేడుకల నెపంతో మోయినాబాద్‌లోని ఒక ప్రదేశానికి తీసుకెళ్లి, బలవంతంగా మద్యం సేవించేలా చేసి, అచేతన స్థితిలో ఉన్న బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడని ఆమె వివరించారు.
న్యాయం కోసం వెళ్తే.. కేంద్ర మంత్రి ఇంటి వద్ద బెదిరింపులు
జరిగిన దారుణంపై ప్రశ్నించేందుకు, సమస్యను పరిష్కరించుకునేందుకు 2026 ఏప్రిల్ 23న కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసానికి వెళ్లినట్లు బాధితురాలి కుటుంబం తెలిపింది. భగీరథ్ అనుచరుడు సంగప్ప తో కలిసి వెళ్లిన తమకు అక్కడ భరోసా లభిస్తుందని ఆశించామని, కానీ దానికి భిన్నంగా బెదిరింపులు ఎదురయ్యాయని ఆమె పేర్కొన్నారు.
"మేము అక్కడికి వెళ్ళింది న్యాయం కోసం. కానీ బండి సంజయ్ తన రాజకీయ ప్రాబల్యాన్ని చూపిస్తూ మమ్మల్ని హెచ్చరించారు. తన అనుచరుల ద్వారా మా కుటుంబానికి కష్టాలు తప్పవని బెదిరించారు. ఆ రోజు నుంచి మేము నిరంతరం ప్రాణభయంతో బతుకుతున్నాం" అని ఆ తల్లి పేర్కొన్నారు.
పోలీసుల తాత్సారం - ప్రజల ఆందోళనతో కదిలిన యంత్రాంగం
{{/usCountry}}"మేము అక్కడికి వెళ్ళింది న్యాయం కోసం. కానీ బండి సంజయ్ తన రాజకీయ ప్రాబల్యాన్ని చూపిస్తూ మమ్మల్ని హెచ్చరించారు. తన అనుచరుల ద్వారా మా కుటుంబానికి కష్టాలు తప్పవని బెదిరించారు. ఆ రోజు నుంచి మేము నిరంతరం ప్రాణభయంతో బతుకుతున్నాం" అని ఆ తల్లి పేర్కొన్నారు.
పోలీసుల తాత్సారం - ప్రజల ఆందోళనతో కదిలిన యంత్రాంగం
{{/usCountry}}ఈ నెల 8వ తేదీన పేట్ బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించినా, చట్టం తన పని తాను చేయడంలో తీవ్ర జాప్యం చేసిందని బాధితురాలి తల్లి ఆరోపించారు. మైనర్ బాలిక అంతటి బాధను వివరిస్తున్నా, జూరిస్డిక్షన్ పేరుతో ఐదు గంటల పాటు స్టేషన్‌లోనే కూర్చోబెట్టారని, చివరకు 'జీరో ఎఫ్ఐఆర్' కోసం పట్టుబట్టిన తర్వాతే ఫిర్యాదు తీసుకున్నారని ఆమె తెలిపారు. మొదట బెయిల్ వచ్చే సెక్షన్లే పెట్టిన పోలీసులు, ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాక, ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసి కఠినమైన సెక్షన్లు నమోదు చేశారని వివరించారు.
బాధితురాలి గుర్తింపుపై కుట్ర
ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా, సామాజిక మాధ్యమాల్లో బాధితురాలి వయసుపై వివాదం రేపడం, ఆమె ఫోటోలను, గుర్తింపును బయటపెట్టడం వంటి చర్యల ద్వారా తమను మరింత మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మైనర్ల గుర్తింపును కాపాడటం సమాజం యొక్క నైతిక బాధ్యతని ఆమె గుర్తు చేశారు.
తమకు ప్రాణహాని ఉందని, నిష్పాక్షికంగా విచారణ జరిపి నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆమె తెలంగాణ ప్రభుత్వానికి, న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు.