తన కుమారుడు బండి సాయి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైన ఘటన మీద బండి సంజయ్ స్పందించారు. తనకు చట్టంపై గౌరవం, న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. జీవితాంతం భారత రాజ్యాంగానికి కట్టుబడే ఉన్నానని, దశాబ్దాలుగా ప్రజలతోనే ఉన్న నేను మచ్చ లేని జీవితం గడిపానని గర్వంగా చెప్పగలను అన్నారు.

తనను రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు తన పిల్లలను, కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఇది వారిలో గూడుకట్టుకున్న నిరాశ నిస్పృహలకు అద్దం పడుతుందన్నారు.
'అట్టడుగు స్థాయి నుంచే నా ప్రజా జీవితాన్ని మొదలుపెట్టాను. కష్టపడి పనిచేసి ప్రజల ఆశీర్వాదంతో నాడు కార్పొరేటర్ గా, నేడు ఎంపీగా ఎన్నికై, కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వెనకబడి వర్గాలకు చెందిన బీసీ వ్యక్తి, నాయకుడిగా కేంద్రమంత్రి స్థాయికి ఎదగడాన్ని కొన్ని శక్తులు జీర్ణించుకోలేక కుట్రలకు తెరతీశాయి.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో నన్ను వ్యక్తిగతంగా అప్రతిష్టపాలు చేయాలన్నదే ఆ కుట్రల వెనకున్న అసలు లక్ష్యం. తప్పేదో.. ఒప్పేదో.. న్యాయవ్యవస్థ నిర్ణయిస్తుందన్న నమ్మకం నాకుంది. సమయం ప్రతి ఆరోపణకు సమాధానం ఇస్తుంది, ప్రతి కుట్రను బహిర్గతం చేస్తుంది.' అని బండి సంజయ్ అన్నారు.
ఏం జరిగిందంటే
గతేడాది డిసెంబర్ 31వ తేదీన మొయినాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్‌లో భగీరథ్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు 10వ తరగతి మధ్యలోనే ఆపేసిన విద్యార్థినిగా గుర్తించారు. ఆమె కుటుంబ సభ్యులు పెట్‌బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో, బాలిక వయస్సును ధృువీకరించుకున్న పోలీసులు.. పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు.
మరోవైపు ఈ కేసులో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ఈ పోక్సో కేసు నమోదు కావడానికి ఒక రోజు ముందే బండి భగీరథ్ కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో సదరు బాలిక కుటుంబంపై ఫిర్యాదు చేశారు. తనను స్నేహం పేరుతో ట్రాప్ చేసి.. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నాడు. తాను నిరాకరించడంతో రూ. 5 కోట్లు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేస్తున్నారని తన ఫిర్యాదులో ప్రస్తావించాడు.
{{/usCountry}}మరోవైపు ఈ కేసులో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ఈ పోక్సో కేసు నమోదు కావడానికి ఒక రోజు ముందే బండి భగీరథ్ కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో సదరు బాలిక కుటుంబంపై ఫిర్యాదు చేశారు. తనను స్నేహం పేరుతో ట్రాప్ చేసి.. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నాడు. తాను నిరాకరించడంతో రూ. 5 కోట్లు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేస్తున్నారని తన ఫిర్యాదులో ప్రస్తావించాడు.
{{/usCountry}}స్నేహితుల ద్వారా పరిచయమైన ఆ అమ్మాయి తనను ఫ్యామిలీ ఫంక్షన్లకు, దేవాలయాలకు ఆహ్వానించిందని.. అంతా పథకం ప్రకారమే జరిగిందని ఆయన ఆరోపించారు. ఆమె తండ్రికి రూ. 50,000 చెల్లించానని ఫిర్యాదులో వివరించారు.