బీసీ జనాభాలో ఏ ఉప కులాలు వెనుకబడి ఉన్నాయో గుర్తించడానికి విద్యార్థుల కులంపై డేటాను సేకరించాలని విద్యా శాఖను బీసీ కమిషన్ కోరింది. రాష్ట్రంలో విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల సమాచారాన్ని కులాల వారిగా సేకరించే అంశంపైన బీసీ కమిషన్ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు బీసీ కమిషన్, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు సమావేశం అయ్యారు.

మార్చి నాటికి డేటాను కమిషన్‌కు అందజేస్తామని విద్యాశాఖ హామీ ఇచ్చింది. ఈ సంవత్సరం నుండే అడ్మిషన్ల సమయంలో కుల సంబంధిత సమాచారాన్ని సేకరిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యదర్శి కూడా తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రంలో విద్యార్థుల డేటాను సేకరించడంలో జాప్యం జరుగుతోందని, దీని ప్రాధాన్యతను గుర్తించి సమాచారం సేకరించాలని బీసీ కమిషన్ చెప్పింది.
ఈ సమాచారం ఆధారంగా బీసీ విద్యార్థుల్లో ఏ కులానికి, ఏ వర్గానికి చెందినవారు విద్యకు దూరంగా ఉంటున్నారో గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు అవకాశం ఉంటుందని బీసీ కమిషన్ అభిప్రాయపడింది.
సమావేశానికి వచ్చిన అదికారులు వెంటనే ఈ సమాచారాన్ని సేకరించే కార్యక్రమానికి శ్రీకారం చూడతారని చెప్పారు. ఈ సంవత్సరం మార్చి లోపల వివరాలు అందిస్తామన్నారు. ఈ ఏడాది నుంచే అడ్మిషన్స్‌లో రాబోయే విద్యా సంవత్సరం నుంచి జరిగే ప్రవేశ పరిక్షలోనూ కుల సంబంధిత సమాచారాన్ని కూడా సేకరించబోతున్నట్టుగా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేష్ చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీని అనుసరించి, తెలంగాణ అసెంబ్లీ ఫిబ్రవరి 2024లో సమగ్ర కుల గణనను నిర్వహించడానికి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. నవంబర్ 2024, 2025 ప్రారంభంలో నిర్వహించిన విస్తృత గృహ సర్వేలో, రాష్ట్ర జనాభాలో వెనకబడిన తరగతులు 56.33 శాతం ఉన్నారని వెల్లడించింది.
ఈ సర్వే రాష్ట్ర జనాభా వివరాలను అందించినప్పటికీ, విద్యా అసమానతలను పరిష్కరించడానికి సూక్ష్మమైన నిర్దిష్ట డేటా అవసరమని బీసీ కమిషన్ గుర్తించింది. అనేక బీసీ ఉప కులాలు అధికారిక రికార్డులలో అదృశ్యంగా ఉన్నాయి. దీని ఫలితంగా స్కాలర్షిప్లు, సీట్ల పంపిణీ విషయంలో గందరగోళం నెలకొంది.
{{/usCountry}}ఈ సర్వే రాష్ట్ర జనాభా వివరాలను అందించినప్పటికీ, విద్యా అసమానతలను పరిష్కరించడానికి సూక్ష్మమైన నిర్దిష్ట డేటా అవసరమని బీసీ కమిషన్ గుర్తించింది. అనేక బీసీ ఉప కులాలు అధికారిక రికార్డులలో అదృశ్యంగా ఉన్నాయి. దీని ఫలితంగా స్కాలర్షిప్లు, సీట్ల పంపిణీ విషయంలో గందరగోళం నెలకొంది.
{{/usCountry}}