తెలంగాణ DEECET-2026 షెడ్యూల్ విడుదల.. మే 21, 22 తేదీల్లో పరీక్షలు
తెలంగాణ DEECET-2026 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు టీజీ డీసెట్-2026 షెడ్యూల్ పరీక్షల తేదీలను పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది.
2026-28 విద్యా బ్యాచ్‌కు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్ (DPSE) కోర్సులలో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్ష అయిన తెలంగాణ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 (TG DEECET) షెడ్యూల్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ పరీక్ష మే 21, 22 తేదీల్లో నిర్వహించనున్నారు.

తెలంగాణ అంతటా మైనారిటీ, మైనారిటీయేతర కళాశాలలతో సహా ప్రభుత్వ జిల్లా విద్య మరియు శిక్షణ సంస్థలు (DIETలు), ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ ఉపాధ్యాయ విద్యా సంస్థల్లో ప్రవేశాలు జరుగుతాయి. అర్హత, రిజిస్ట్రేషన్ ఫీజు, షెడ్యూల్‌తో సహా వివరణాత్మక నోటిఫికేషన్ ఫిబ్రవరి చివరి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది.
రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి టీజీ డీసెట్-2026 పరీక్షలు జరుగుతాయి. ఈ మేరకు షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. 2026-28 విద్యా సంవత్సరానికిగానూ కంప్యూటర్ ఆధారతి పరీక్షా పద్ధతిలో మే 21, 22 తేదీల్లో పరీక్షలు ఉంటాయి. రాష్ట్రంలోని మైనారిటీ, నాన్-మైనారిటీ విద్యాసంస్థల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని డీఈఈసెట్ చైర్మన్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు.
మరోవైపు రాష్ట్రంలో 2026-28 విద్యా సంవత్సరానికి సంబంధించి.. రెండు సంవత్సరా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలకోసం నిర్వహించే.. డీసెట్ 2026 కన్వీనర్‌ను ప్రభుత్వం ప్రకటించింది. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, డీఈఈసెట్ చైర్‌పర్సన్ నవీన్ నికోలస్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రమేశ్‌ను డీఈఈసెట్-2026 కన్వీనర్‌గా నామినేట్ చేస్తూ.. నిర్ణయం తీసుకున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


