Telangana BDS Admissions : రాష్ట్రంలో డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. 2026-27 విద్యాసంవత్సరానికి గానూ కాంపిటెంట్ అథారిటీ కోటా కింద బిడిఎస్ (BDS) కోర్సుల్లో ప్రవేశాల కోసం మొదటి విడత వెబ్ ఆధారిత కౌన్సెలింగ్‌ను వర్సిటీ ప్రారంభించింది.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డెంటల్ కళాశాలలతో పాటు సికింద్రాబాద్‌లోని ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్‌లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఈ నోటిఫికేషన్ వర్తిస్తుంది. దివ్యాంగులు (PWD), ఆర్మీ ఉద్యోగుల పిల్లలు (CAP), పోలీసు అమరవీరుల పిల్లలు (PMC), ఆంగ్లో-ఇండియన్ విభాగాల కేటగిరీల అభ్యర్థులు కూడా ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు.
ముఖ్యమైన తేదీలు, వెబ్‌సైట్ వివరాలు
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తయి, ఆగస్టు 28న KNRUHS విడుదల చేసిన తుది మెరిట్ జాబితాలో పేరు ఉన్న NEET UG 2026 అర్హత సాధించిన అభ్యర్థులందరూ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి అర్హులు.
- వెబ్ ఆప్షన్ల ప్రారంభం : సెప్టెంబర్ 4, 2026 మధ్యాహ్నం 2:00 గంటల నుంచి
- చివరి తేదీ : సెప్టెంబర్ 6, 2026 సాయంత్రం 4:00 గంటల వరకు
- అధికారిక వెబ్‌సైట్ : అభ్యర్థులు కంప్యూటర్ ద్వారా https://tsbdsadm.tsche.in వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి తమ ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
సీట్ల బ్లాకింగ్‌ను అరికట్టేందుకు కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ కొన్ని కఠిన నిబంధనలను విధిస్తూ స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది.
- మొదటి విడత కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోని అభ్యర్థులకు తదుపరి విడతల కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం ఉండదు.
- అభ్యర్థులు తమ అర్హత, ప్రాధాన్యతను బట్టి ఎన్ని కళాశాలలకైనా పరిమితి లేకుండా ఆప్షన్లను ఎంచుకోవచ్చు.
- వెబ్ ఆప్షన్లు నమోదు చేసే సమయంలో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఆరు అక్షరాల ఓటీపీ వస్తుంది. ఆప్షన్లు సేవ్ చేసిన తర్వాత ప్రింటౌట్ తీసుకోవడం మంచిది.
- ఒకవేళ అభ్యర్థికి బీడీఎస్ సీటు కేటాయించిన తర్వాత ఆ కళాశాలలో చేరకపోతే, ఆ తదుపరి కౌన్సెలింగ్ విడతలకు ఆ అభ్యర్థి అర్హత కోల్పోతారు. సీటు వచ్చిన వారు యూనివర్సిటీ ఫీజు రూ. 12,000 ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా చెల్లించి అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- అభ్యర్థులు అలాట్‌మెంట్ ఆర్డర్‌లో పేర్కొన్న గడువులోగా కేటాయించిన డెంటల్ కాలేజీ ప్రిన్సిపాల్‌ను కలిసి, ఒరిజినల్ సర్టిఫికెట్లు, అవసరమైన బాండ్లు సమర్పించి ట్యూషన్ ఫీజు చెల్లించాలి. నిర్ణీత సమయంలోగా చేరకపోతే ప్రవేశం స్వయంచాలకంగా రద్దవుతుంది.
యూనివర్సిటీ హెల్ప్‌లైన్ నంబర్లు
అభ్యర్థులకు ఏవైనా సందేహాలు లేదా సాంకేతిక సమస్యలు ఉంటే నివారించుకోవడానికి విశ్వవిద్యాలయం హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. పనిదినాల్లో ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ఈ నంబర్లలో సంప్రదించవచ్చు:
- నిబంధనల వివరణ కోసం: 7901098840, 9490585796
- సాంకేతిక సమస్యల కోసం: 9392685856, 9059672216, 7842136688
- ఫీజు చెల్లింపు సమస్యల కోసం: 9618240276
- సర్టిఫికెట్ల పరిశీలన సమాచారం కోసం: 9866092370
అభ్యర్థులకు ఏవైనా సందేహాలు లేదా సాంకేతిక సమస్యలు ఉంటే నివారించుకోవడానికి విశ్వవిద్యాలయం హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. పనిదినాల్లో ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ఈ నంబర్లలో సంప్రదించవచ్చు:
- నిబంధనల వివరణ కోసం: 7901098840, 9490585796
- సాంకేతిక సమస్యల కోసం: 9392685856, 9059672216, 7842136688
- ఫీజు చెల్లింపు సమస్యల కోసం: 9618240276
- సర్టిఫికెట్ల పరిశీలన సమాచారం కోసం: 9866092370