TG MBBS BDS Admissions : ఎంబీబీఎస్, బీడీఎస్ యాజమాన్య కోటా అడ్మిషన్లు - రిజిస్ట్రేషన్లు పునఃప్రారంభం
KNRUHS MBBS BDS Management Quota 2026 : తెలంగాణలోని ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ మేనేజ్‌మెంట్ కోటా ప్రవేశాలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను కాళోజీ యూనివర్సిటీ రీఓపెన్ చేసింది. సెప్టెంబర్ 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
KNRUHS MBBS BDS Management Quota 2026 : రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ ఎంబీబీఎస్ (MBBS), బీడీఎస్ (BDS) కోర్సుల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల గడువును కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్శిటీ పునఃప్రారంభించింది.

అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన విశ్వవిద్యాలయం… రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరోసారి అందుబాటులోకి తీసుకువస్తూ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 12న విడుదల చేసిన నోటిఫికేషన్‌కు కొనసాగింపుగా ఈ ప్రకటన వెలువడింది. కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ అనుబంధ ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలలతో పాటు అనురాగ్ యూనివర్సిటీ అనుబంధ నీలిమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాలలోని మేనేజ్‌మెంట్ కోటా సీట్ల అడ్మిషన్లకు ఈ రిజిస్ట్రేషన్ వర్తిస్తుంది. గతంలో ఆగస్టు 20తో ముగిసిన ఈ దరఖాస్తుల ప్రక్రియను ఇప్పుడు తిరిగి ప్రారంభించారు.
ముఖ్యమైన వివరాలు
- రిజిస్ట్రేషన్ ప్రారంభం : సెప్టెంబర్ 2, 2026 ఉదయం 6:00 గంటల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.
- రిజిస్ట్రేషన్ ముగింపు : సెప్టెంబర్ 4, 2026 మధ్యాహ్నం 2:00 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.
- అధికారిక దరఖాస్తు పోర్టల్ : అర్హులైన అభ్యర్థులు [ https://tspvtmedadm.tsche.in ]( https://tspvtmedadm.tsche.in ) పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయాలి.
- నీట్ యూజీ 2026 (NEET UG 2026) ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి, నిర్ణీత కట్ ఆఫ్ స్కోరు లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు ఈ మేనేజ్‌మెంట్ కోటా అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- గతంలో ఆగస్టు 12న విడుదల చేసిన ప్రాస్పెక్టస్, నోటిఫికేషన్ ప్రకారం ఇతర నియమ నిబంధనలు అమలులో ఉంటాయి.
- ఇదివరకే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ కొత్తగా రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ రిజిస్ట్రార్ సెప్టెంబర్ 1న విడుదల చేసిన అధికారిక ప్రకటనలో స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

