NEHS : ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌పై కీలక అప్డేట్

New Employees Health Scheme : తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కొంతకాలంగా ఎదురుచూస్తున్న ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ అధికారికంగా అమల్లోకి వచ్చింది.

Published on: Aug 22, 2026, 21:52:58 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రత దిశగా ప్రభుత్వం మరొక కీలక ముందడుగు వేసింది. న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్(NEHS) అమలుకు సంబంధించి సమగ్ర బోర్డు ఆమోదిత మార్గదర్శకాలను విడుదల చేస్తూ తెలంగాణ ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌ అమలు
న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌ అమలు

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం(New Employees Health Scheme - NEHS) అమలుకు సంబంధించిన సమగ్ర మార్గదర్శకాలను ప్రభుత్వం అధికారికంగా అమలు చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. ​ట్రస్టీల బోర్డు ఆమోదంతో రూపొందించిన ఈ పాలనా, నిర్వహణ మార్గదర్శకాలకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, EHCT ఛైర్మన్ సంజయ్ జాజు జారీ చేశారు.

ఈ నూతన మార్గదర్శకాలు జులై 17, 2026 నుండి అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ట్రస్ట్ నిర్ణయం ప్రకారం ఈ కొత్త విధివిధానాలు 17.07.2026 నుండి వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓతో పాటు సంబంధిత అధికారులు ఈ పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసిన జీఓ ఎంఎస్ నంబర్ 40 (17.06.2026), జీఓ ఎంఎస్ నంబర్ 50 (16.07.2026)లకు అనుగుణంగా, ట్రస్ట్ బోర్డు సమావేశం నిర్ణయాల ప్రాతిపదికన ఈ మార్గదర్శకాలు రూపొందించారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు మెరుగైన, ఉచిత వైద్య సేవలు అందించేందుకు ఈ స్కీమ్ ఎంతో దోహదపడుతుంది. ఉద్యోగులు, పెన్షనర్లు కార్పొరేట్, నెట్‌వర్క్ ఆసుపత్రులలో నగదు రహిత చికిత్స పొందే వెసులుబాటు ఉంటుంది.

పథకం సులభంగా, పారదర్శకంగా, ఎటువంటి సాంకేతిక లోపాలు లేకుండా అమలు కావడానికి ఈ కొత్త నిబంధనలు ఉపయోగపడతాయి. ఎంప్లానెల్ అయిన అన్ని ప్రధాన ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రులలో ఇన్-పేషెంట్ చికిత్సలతో పాటు క్లిష్టమైన ఆపరేషన్లకు ఈ పథకం వర్తిస్తుంది.

రాష్ట్ర సచివాలయం, అన్ని శాఖల అధిపతులు, జిల్లా స్థాయి అధికారులకు ఈ ఉత్తర్వుల ప్రతులను పంపిస్తూ, పథకాన్ని తక్షణమే అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశించింది.

దీంతో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు సంబంధిత ఆసుపత్రుల్లో క్యాష్‌లెస్ వైద్య సేవలు పొందవచ్చు. మార్గదర్శకాల బుక్‌లెట్‌‌లో ఆసుపత్రుల ఎంపానెల్‌మెంట్ ప్రక్రియ , చికిత్సా ప్రోటోకాల్స్ , ఆసుపత్రుల బకాయిల చెల్లింపులకు సంబంధించిన విధానాలు ఉంటాయి. లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చికిత్సలు పొందనున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More