...
...
Next Story

ప్రసాద్ స్కీమ్ కింద రూ.41.38 కోట్లతో భద్రాచలం, పర్ణశాల పనులు.. సగానికి పైగా పూర్తి!

Bhadrachalam Temple : పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రసాద్ పథకం కింద తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలాన్ని అభివృద్ధి చేస్తోంది. భక్తుల ఆధ్యాత్మిక అనుభవాన్ని మరింత పెంచేందుకు మెరుగైన మౌలిక సదుపాయాలు, ఆధునికతను జోడిస్తున్నారు.

Updated on: Jul 29, 2026, 13:22:17 IST
Advertisement

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం, దాని అనుబంధ ఆధ్యాత్మిక ప్రాంతాలు త్వరలోనే సరికొత్త శోభను సంతరించుకోనున్నాయి. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ‘ప్రసాద్’ (PRASHAD - Pilgrimage Rejuvenation and Spiritual Heritage Augmentation Drive) పథకం కింద భద్రాచలాన్ని అంతర్జాతీయ స్థాయి వసతులతో అభివృద్ధి చేస్తున్నారు. భక్తుల ఆధ్యాత్మిక అనుభూతిని మరింత మెరుగుపరచేందుకు ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన వేగవంతంగా జరుగుతోంది.

భద్రాచలం
భద్రాచలం

మొత్తం రూ.41.38 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ పనులు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 55 శాతానికి పైగా కీలక పనులు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. భద్రాచలం శ్రీరామనవమి వేడుకలకు వేదికయ్యే ప్రసిద్ధ మిథిలా స్టేడియంపై షెడ్ నిర్మాణం, భక్తుల కోసం ప్రత్యేక వ్రత మంటపం, ఆధునిక సదుపాయాల కాంప్లెక్స్, క్యాంటీన్ బ్లాక్, రక్షణ గోడలు/ఫెన్సింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

చారిత్రక ప్రాంతం పర్ణశాలలో కూడా అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. పర్ణశాల వద్ద భక్తుల వసతి కోసం రూఫింగ్, గ్రానైట్ ఫ్లోరింగ్‌తో కూడిన పిల్‌గ్రిమ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. విస్తృతమైన పార్కింగ్ స్థలాలు, బయటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.

గోదావరి నదిలో ప్రయాణించే భక్తుల కోసం ప్రత్యేక బోటింగ్ (పడవ) సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాజెక్టును 2026 చివరి నాటికి పూర్తిగా అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టితో ప్రవేశపెట్టిన ‘ప్రసాద్’ పథకం ద్వారా భారతదేశంలోని సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని పరిరక్షిస్తూనే ప్రపంచస్థాయి మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe