Yadagirigutta Temple Mandapam : యాదగిరిగుట్టలో కొత్త కళ్యాణ మండపం - ఘనంగా భూమిపూజ

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి కొండపైన నూతన కళ్యాణ మండప నిర్మాణానికి భూమిపూజ ఘనంగా జరిగింది. దేవస్థాన చైర్మన్ మన్నె సత్యనారాయణ రెడ్డి సొంత నిధులతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు.

Published on: Oct 30, 2026, 17:00:50 IST
By , Yadagirigutta
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామివారి దివ్యక్షేత్రంలో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. యాదగిరిగుట్ట కొండపైన నూతనంగా నిర్మించతలపెట్టిన కళ్యాణ మండప నిర్మాణ పనులకు సంబంధించి భూమిపూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, శాస్త్రోక్త పూజా విధానాల నడుమ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

యాదగిరిగుట్టలో నూతన కళ్యాణ మండపం - నమూనా చిత్రం
యాదగిరిగుట్టలో నూతన కళ్యాణ మండపం - నమూనా చిత్రం

ఈ భూమిపూజ మహోత్సవంలో ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్యతో పాటు యాదగిరిగుట్ట దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ మన్నె సత్యనారాయణ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ నూతన కళ్యాణ మండపాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వారు తెలిపారు.

ఛైౌర్మన్ సొంత నిధులతో…

భక్తులకు సేవ చేయాలనే గొప్ప సంకల్పంతో యాదగిరిగుట్ట దేవస్థాన బోర్డు చైర్మన్ ఎం. సత్యనారాయణ రెడ్డి తన సొంత నిధులను వెచ్చించి ఈ కళ్యాణ మండప నిర్మాణ పనులను చేపట్టడం విశేషం. స్వామివారి సేవలో భాగస్వాములు కావడానికే ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

ఈ పూజా కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేవస్థాన బోర్డు సభ్యులతో పాటు ఎమ్మెల్యే గడ్డం వినోద్, టీ. విజేందర్ గౌడ్, లక్ష్మీనారాయణ, ఈశ్వరమ్మ, గుండు మల్లయ్య, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, దేవస్థాన కార్యనిర్వహణాధికారి (ఈఓ) జె. భవానీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

కొండపైన ఈ కళ్యాణ మండపం అందుబాటులోకి వస్తే భక్తులకు… కల్యాణాలు జరిపించుకునే వారికి మరింత సౌకర్యవంతంగా ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More