గ్రూప్ 2 ర్యాంకర్లకు హైకోర్టులో ఊరట.. సింగిల్‌ బెంచ్‌ ఉత్తర్వులు సస్పెండ్‌

తెలంగాణలో 2015 గ్రూప్‌ 2 ర్యాంకర్లకు హైకోర్టులో ఊరట దొరికింది. గ్రూప్‌ 2పై సింగిల్‌ బెంచ్‌ ఉత్తర్వులను సీజే ధర్మాసనం సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

Published on: Nov 27, 2025, 13:24:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

2015 గ్రూప్-2 నియామకాల్లో ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. నియామక ప్రక్రియను రద్దు చేసి, ఎంపిక జాబితాను రద్దు చేసిన సింగిల్ బెంచ్ తీర్పును చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) దాఖలు చేసిన అప్పీల్ విచారణ సందర్భంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి. సింగిల్ బెంచ్ తీర్పును టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్‌లో సవాల్ చేయగా.. విచారణ చేపట్టిన న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

తెలంగాణ హైకోర్టు
తెలంగాణ హైకోర్టు

అంతకుముందు హైకోర్టు 2015 గ్రూప్-2 ఫలితాలను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. ఎంపిక జాబితాను కొట్టి వేసింది. అక్టోబర్ 24, 2019న జారీ చేసిన ఎంపిక జాబితా చెల్లదని ప్రకటించింది. సాంకేతిక కమిటీ సిఫార్సులు, 2019లో హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు, సాంకేతికత కమిటీ సిఫారసులకు వ్యతిరేకంగా డబుల్ బబ్లింగ్, వైట్‌నర్‌ల వాడకం, ఓవర్‌రైటింగ్ ఉన్న సమాధాన పత్రాలను కమిషన్ తిరిగి మూల్యాంకనం చేయడం చెల్లదని కోర్టు పేర్కొంది. ఆన్సర్ షీట్లలో ట్యాంపరింగ్ జరిగిందని స్పష్టంగా ఉన్నప్పుడు పక్కన పెట్టకపోవడం కమిషన్ వైఫల్యామేనని స్పష్టం చేసింది.

హైకోర్టు తీర్పు, సాంకేతిక కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా వ్యవహరించే అధికారం టీజీపీఎస్సీకీ లేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. నిపుణుల కమిటీ మార్గదర్శకాలను దాటవేసే అధికారం కమిషన్‌కు లేదని, సమాధాన పత్రాలలో కనిపించే ట్యాంపరింగ్ అనర్హతకు దారితీసి ఉండేదని సింగిల్ బెంచ్ పేర్కొంది. 2019 ఫలితాలను ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా చెబుతూ, ఎనిమిది వారాల్లోగా మూల్యాంకనం, సవరించిన మెరిట్ జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించింది.

ఈ తీర్పుపై టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. కోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణనను ఆరు వారాలకు వాయిదా వేసింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More