...
...
Next Story

ఎస్ఐఆర్ అప్డేట్.. ఆన్‌లైన్‌లో ఫారమ్ సమర్పిస్తే హార్డ్ కాపీ కోసం ఇబ్బంది పెట్టొద్దు

SIR Update : ఎస్ఐఆర్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Published on: Jul 21, 2026, 19:01:12 IST
Advertisement

రాష్ట్రంలో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(Special Intensive Revision-SIR) ప్రక్రియకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను సకాలంలో పూర్తయ్యేలా సంబంధిత ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి ఐఎఎస్ ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఎస్ఐఆర్‌పై అప్డేట్
ఎస్ఐఆర్‌పై అప్డేట్

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారమ్‌లను ఆన్‌లైన్‌లో సమర్పించిట్లయితే హార్డ్ కాపీ కోసం బీఎల్ఓలు ఓటర్లను ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. ఎన్యుమరేషన్ ఫారమ్ సమర్పించేటప్పుడు ఆధార్ కార్డు తప్పనిసరి అని చెప్పొద్దని, ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారమ్‌లను సమర్పించేందుకు అవసరమైన సహాయాన్ని అందించి, వారి ఫిర్యాదులను పరిష్కరించాలని తెలిపారు.

అలాగే ఓటరు జాబితాల్లో వీవీఐపీ, వీఐపీ ఓటర్ల పేర్లు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలన్నారు ప్రధాన ఎన్నికల అధికారి. గైర్హాజరు, నివాసం మారిన, మరణించిన ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు. డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు. రాజకీయపార్టీలతో నిర్వహించే సమావేశాల్లో పారదర్శకత పాటిస్తూ, సంబంధిత వివరాలను నమోదు చేయాలని, పట్టణ ప్రాంతాలు, పురోగతి తక్కువ ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు.

ఈ వారంలోగా ప్రతి జిల్లాలో ఎన్యుమరేషన్ ప్రక్రియ 90 శాతం పూర్తయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులను సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. అలాగే నో మ్యాపింగ్ కేటగిరీలో ఉన్న ఓటర్లను పూర్తిస్థాయిలో ధృవీకరించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్ఐఆర్-2026 కార్యక్రమాన్ని సకాలంలో పూర్తి చేయడానికి సంబంధిత ఎన్నికల అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe