Bonalu jatara Traffic : బోనాల పండుగ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు చూడండి

బోనాల జాతర సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు ఉన్నాయి. ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులు వివరాలు వెల్లడించారు.

Updated on: Aug 9, 2026, 05:41:15 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బోనాల జాతర ఉత్సవాలు, ఊరేగింపుల సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ఆగస్టు 9, 10 తేదీల్లో విస్తృత స్థాయి ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. అంతేకాకుండా భద్రతా కారణ దృష్ట్యా నగరంలోని పలు ప్రాంతాల్లో మద్యం షాపులను మూసివేయాల్సిందిగా పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

హైదరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు
హైదరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు

లాల్ దర్వాజా మహంకాళి బోనాలు – ట్రాఫిక్ ఆంక్షల వివరాలు

సింహవాహిని శ్రీ మహంకాళి లాల్ దర్వాజా బోనాల ఉత్సవాల సందర్భంగా ఆగస్టు 9న ఉదయం 6 గంటల నుంచి, అలాగే ఆగస్టు 10న ఉదయం 9 గంటల నుంచి ఊరేగింపులు పూర్తయ్యే వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. చార్మినార్, లాల్ దర్వాజా, అలియాబాద్, నాగులచింత, గౌలీపురా, ఛత్రినాక, మొఘల్ పురా, హరిబౌలి, నయాపూల్ పరిసరాల్లోని పలు రహదారులను పూర్తిగా మూసివేయడం లేదా మళ్లించడం జరుగుతుంది.

మదీనా ఎక్స్ రోడ్స్ నుంచి గుల్జార్ హౌస్, చార్మినార్, హిమ్మత్‌పురా, నాగులచింత, అలియాబాద్ మీదుగా ఇంజిన్ బౌలీ వరకు ఉండే ప్రధాన రహదారిని ఊరేగింపులు ముగిసే వరకు సాధారణ వాహనాల రాకపోకలకు పూర్తిగా మూసివేస్తారు.

దర్శనానికి వచ్చే భక్తులు షాలిబండ, అల్కా థియేటర్, ఆర్య వైశ్య మందిరం, వీడీపీ స్కూల్, మిత్ర స్పోర్ట్స్ క్లబ్, చార్మినార్ బస్ టెర్మినల్ సమీపంలోని కేటాయించిన పార్కింగ్ స్థలాలను ఉపయోగించుకోవాలని సూచించారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఆర్టీసీ బస్సులను ఓల్డ్ సీబీఎస్, అఫ్జల్‌గంజ్, దారుల్‌షిఫా, ఛత్రినాక, ఇంజిన్ బౌలీ వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక పాయింట్ల వరకే అనుమతిస్తారు.

ఇతర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు

కార్వాన్ (దర్బార్ మైసమ్మ బోనాలు): సబ్జీమండి, కార్వాన్ నుంచి నల్లపోచమ్మ గుడి వరకు జరిగే శ్రీ దర్బార్ మైసమ్మ బోనాల ఉత్సవాలు, ఏనుగు ఊరేగింపు దృష్ట్యా ఆగస్టు 8 రాత్రి 9 గంటల నుంచి ఆగస్టు 10 ఉదయం వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి.

అంబర్‌పేట్ (మహంకాళి ఆలయం): అంబర్‌పేట్ మహంకాళి ఆలయం వద్ద ఆగస్టు 9 ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 10 మధ్యాహ్నం 12 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. వాహనదారులు అంబర్‌పేట్ ఫ్లైఓవర్ లేదా ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.

చిలకలగూడ (కట్టమైసమ్మ-పోచమ్మ ఆలయం): చిలకలగూడలోని కట్టమైసమ్మ-పోచమ్మ ఆలయ పరిసరాల్లో ఆగస్టు 9, 10 తేదీల్లో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆంక్షలు ఉంటాయి. ఈ సమయంలో వాహనదారులు ఆ మార్గంలో వెళ్లకుండా ఇతర దారులను ఎంచుకోవడం శ్రేయస్కరం.

ప్రయాణికులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ సహాయం లేదా వివరాల కోసం పోలీసు హెల్ప్‌లైన్ నంబర్ 9010203626 ను సంప్రదించవచ్చు.

ఇంజిన్ బౌలీ, ఫలక్‌నుమా వైపు నుండి అలియాబాద్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను షంషీర్‌గంజ్ "T" జంక్షన్ వద్ద గోశాల, తాడ్‌బండ్ లేదా గోశాల మిస్రీగంజ్, ఖిల్వత్ వైపు మళ్లిస్తారు.

MBNR X రోడ్ నుండి అలియాబాద్ వైపు వెళ్లే వాహనాలను ఇంజిన్ బౌలీ వద్ద జహనుమా, గోశాల, తాడ్‌బండ్ లేదా గోశాల మిస్రీగంజ్, ఖిల్వత్ వైపు మళ్లిస్తారు.

నాగులచింత, సుధా టాకీస్ నుండి లాల్ దర్వాజా వైపు వచ్చే ట్రాఫిక్‌ను నెహ్రూ మోడ్ వద్ద సుధా టాకీస్ ద్వారా గౌలీపురా వైపు మళ్లిస్తారు.

గౌలీపురా నుండి లాల్ దర్వాజా మోడ్ వైపు వచ్చే వాహనాలను సుధా టాకీస్ వద్ద హరిబౌలి మీదుగా మిర్చౌక్ వైపు మళ్లిస్తారు.

పాంచ్‌మొహల్లా నుండి నాగులచింత వైపు వచ్చే ట్రాఫిక్‌ను హరిబౌలి, వోల్గా హోటల్, మిస్రీగంజ్ వైపు మళ్లిస్తారు.

రాజన్న బౌలీ నుండి లాల్ దర్వాజా ఆలయం వైపు వచ్చే ట్రాఫిక్‌ను వెంకటేశ్వర స్వామి ఆలయం (బాబా బార్) లైన్ వద్ద రామస్వామి గంజ్ వైపు మళ్లిస్తారు.

కందికల్ గేట్ నుండి లాల్ దర్వాజా ఆలయం వైపు వచ్చే ట్రాఫిక్‌ను OP ఛత్రినాక PS "Y" జంక్షన్ వద్ద గౌలీపురా వైపు మళ్లిస్తారు.

బాలాజీగంజ్ నుండి లాల్ దర్వాజా వైపు వచ్చే వాహనాలను లక్ష్మీ దేవి పాన్ షాప్ వద్ద నాగులచింత జంక్షన్‌లోని నెహ్రూ విగ్రహం వైపు మళ్లిస్తారు.

గౌలీపురా మీదుగా ఉప్పుగూడ, ఛత్రినాక వైపు నుండి వచ్చే ట్రాఫిక్‌ను మహమ్మద్ షుకూర్ మసీదు వద్ద బలరాజ్ జ్యువెలర్స్ పాయింట్ (గౌలీపురా X రోడ్స్) ద్వారా మొఘల్ పురా పోలీస్ స్టేషన్ వైపు మళ్లిస్తారు.

కందికల్ గేట్ ఫ్లైఓవర్ నుండి ఛత్రినాక OP వైపు వచ్చే వాహనాలను VN రెడ్డి కామన్, ఉప్పుగూడ జండా వైపు మళ్లిస్తారు.

ఓల్డ్ చంద్రాయణగుట్ట నుండి ఛత్రినాక వైపు వచ్చే భారీ వాహనాలను సంతోష్ నగర్, చంద్రాయణగుట్ట వైపు మళ్లిస్తారు.

ఫతే దర్వాజా నుండి హిమ్మత్‌పురా X రోడ్స్/రాజేష్ మెడికల్ హాల్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను వోల్గా హోటల్ "T" జంక్షన్ వద్ద ఖిల్వత్ రోడ్ వైపు మళ్లిస్తారు.

గౌలీపురా నుండి సుధా థియేటర్ వైపు అనుమతించరు. వీటిని మహమ్మద్ షుకూర్ మసీదు వద్ద వోల్తా హోటల్, మొఘల్ పురా మరియు ఏతాబార్ చౌక్ మీదుగా మిర్చౌక్ వైపు మళ్లిస్తారు.

ఛత్రినాక OP నుండి గౌలీపురా వైపు వెళ్లే ట్రాఫిక్‌ను గాంధీ విగ్రహం వద్ద శ్రీరామ్‌నగర్ కాలనీ, CIB క్వార్టర్స్, సుల్తాన్ షాహి, లలితాబాగ్ మరియు మొఘల్ పురా వైపు మళ్లిస్తారు.

మీర్ కా దైరా, మొఘల్ పురా నుండి హరిబౌలి "X" రోడ్స్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను మొఘల్ పురా వాటర్ ట్యాంక్ ఏరియా వైపు మళ్లిస్తారు.

అస్రా హాస్పిటల్, మొఘల్ పురా వాటర్ ట్యాంక్ వైపు నుండి చార్మినార్ వైపు వచ్చే వాహనాలను బీబీ బజార్ వద్ద మళ్లిస్తారు.

భవాని నగర్, మీర్‌జుమ్లా తలాబ్ నుండి చార్మినార్ వైపు అనుమతించరు. వీటిని బీబీ బజార్ X రోడ్స్ వద్ద అలీజా కోట్లా (మీరాలం మండి రోడ్) వైపు మళ్లిస్తారు.

సర్దార్ పటేల్ మహల్ రోడ్ మీదుగా చార్మినార్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను చౌక్ మైదాన్ ఖాన్ వద్ద హఫీజ్ డాంకా మసీదు / అర్మాన్ హోటల్ (శ్రీ గాయత్రి కాలేజీ ద్వారా) అండ్ అలీజా కోట్లా వైపు మళ్లిస్తారు.

యాకుత్‌పురా నుండి గుల్జార్ హౌస్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను ఏతాబార్ చౌక్ వద్ద మీరాలం మండి, అలీజా కోట్లా రోడ్ వైపు మళ్లిస్తారు.

పురానీ హవేలీ నుండి టిప్పు ఖాన్ మసీదు (ఛత్తా బజార్) వైపు వచ్చే ట్రాఫిక్‌ను లక్కడ్ కోటే "X" రోడ్స్ వద్ద APAT జంక్షన్లు లేదా దారుల్‌షిఫా వైపు మళ్లిస్తారు.

చాదర్‌ఘాట్ / నూర్ ఖాన్ బజార్ / S.J రోటరీ / శివాజీ బ్రిడ్జి నుండి సాలార్‌జంగ్ మ్యూజియం రోడ్ వైపు వచ్చే వాహనాలను S.J రోటరీ వద్ద పురానీ హవేలీ రోడ్, శివాజీ బ్రిడ్జి, చాదర్‌ఘాట్ వైపు మళ్లిస్తారు.

ఖిల్వత్ రోడ్ లేదా మూసాబౌలి రోడ్ నుండి లాడ్ బజార్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను మోతీగల్లీ "T" జంక్షన్ వద్ద ఖిల్వత్ ప్లే గ్రౌండ్ లేదా మూసాబౌలి వైపు మళ్లిస్తారు.

బండీ కే అడ్డా, ఘాన్సీ బజార్ నుండి గుల్జార్ హౌస్ వైపు వచ్చే వాహనాలను మిట్టే కే షేర్ (షేర్-యే-బాతుల్ కమాన్) వద్ద ఘాన్సీ బజార్, చెలాపురా వైపు మళ్లిస్తారు.

ఘాన్సీ బజార్, చెలాపురా నుండి చక్రం అడ్డా వైపు వచ్చే ట్రాఫిక్‌ను ఘాన్సీ బజార్ వద్ద చెలాపురా వైపు మళ్లిస్తారు.

పురానాపూల్, గుడ్ విల్ హోటల్, మూసాబౌలి నుండి నయాపూల్ వైపు మూసీ నది మీదుగా వచ్చే వాహనాలను ముస్లింజంగ్ బ్రిడ్జి వద్ద భూలక్ష్మి టెంపుల్ - బేగం బజార్ - ఛాత్రీ వైపు మళ్లిస్తారు.

గౌలిగూడ, సిద్ధియంబర్ బజార్ నుండి నయాపూల్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను అఫ్జల్‌గంజ్ వద్ద ముస్లింజంగ్ బ్రిడ్జి వైపు (ఉస్మానియా జనరల్ ఆసుపత్రి వెనుక రోడ్డు ద్వారా మూసీ నది లేదా శివాజీ బ్రిడ్జి మీదుగా) మళ్లిస్తారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More