Medchal HIV Injection Case: హైదరాబాద్‌లో అత్యంత దారుణమైన ఘటన వెలుగు చూసింది. ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించటంతో ప్రియుడు… హెచ్ఐవీ ఇంజెక్షన్ ఇచ్చాడు. ఈ ఘటన ఇటీవలే జరగగా… తాజాగా సదరు యువతి ఇవాళ సూసైడ్ చేసుకుంది. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ప్రాథమిక వివరాల ప్రకారం… ఈ ఘోర ఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. జనగామ జిల్లాకు చెందిన యువకుడు నగరంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అతని తల్లిదండ్రులిద్దరూ హెచ్‌ఐవీ బాధితులు. తండ్రి గతంలోనే మరణించాడు. అయితే సదరు యువకుడు…. సమీప బంధువైన యువతిని ప్రేమించగా… పెళ్లికి పెద్దలు అంగీకరించారు.
పెళ్లి క్యాన్సిల్ కావటంతో…
తల్లిదండ్రుల పూర్వపరాలు తెలిసిన నేపథ్యంలో… పెళ్లికి సిద్ధమైన యువకుడికి కూడా యువతి కుటుంబ సభ్యులు రక్త పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో యువకుడికి కూడా హెచ్‌ఐవీ ఉన్నట్లు తేలింది. దీంతో యువతి కుటుంబ సభ్యులు ఈ పెళ్లిని రద్దు చేసుకున్నారు.
చాలా కాలంగా ప్రేమిస్తుండగా… సడన్ గా పెళ్లి క్యాన్సిల్ కావటంతో సదరు యువకుడు… క్రూరంగా ఆలోచించాడు. యువతికి కూడా హెచ్‌ఐవీ పాజిటివ్ ఉంటే మరొకరికి ఇవ్వలేరని… అప్పుడు తనతోనే వివాహం చేస్తారని కుట్ర పన్నాడు. గత నెల 11న సిరంజీ కొనుగోలు చేసి…. అందులో తన రక్తాన్ని ఎక్కించాడు. ఆ తర్వాత యువతి ఇంటికి వెళ్లాడు. మరోసారి పెళ్లి గురించి మాట్లాడాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో తన వెంట తెచ్చుకున్న సిరంజీలోని రక్తాన్ని ఆమెకు బలవంతంగా ఎక్కించి పరారయ్యాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
తన శరీరంలోకి ప్రాణాంతకమైన రక్తం ప్రవేశించిందన్న భయం సదరు యువతిని వెంటాడుతూ వచ్చింది. తన జీవితం నాశనమైందన్న ఆవేదనతో…. మనోవేదనతో ఇవాళ ఇంట్లోనే ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. యువతి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రియుడు మనోహర్ జైలులో ఉన్నాడు.
{{/usCountry}}తన శరీరంలోకి ప్రాణాంతకమైన రక్తం ప్రవేశించిందన్న భయం సదరు యువతిని వెంటాడుతూ వచ్చింది. తన జీవితం నాశనమైందన్న ఆవేదనతో…. మనోవేదనతో ఇవాళ ఇంట్లోనే ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. యువతి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రియుడు మనోహర్ జైలులో ఉన్నాడు.
{{/usCountry}}