BRAOU Admissions 2026 : అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్స్.. దరఖాస్తుకు అక్టోబర్ 13 లాస్ట్
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం(BRAOU) ప్రవేశాల నోటిఫికేషన్ 2026-27 విడుదలైన విషయం తెలిసిందే. యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు దగ్గర పడింది.
హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) 2026-2027 విద్యా సంవత్సరానికి గాను వివిధ దూరవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. తెలంగాణలోని వివిధ అధ్యయన కేంద్రాల ద్వారా అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌లలో చేరాలనుకునే అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. కోర్సుల్లో ప్రవేశాలకు అక్టోబర్ 13వ తేదీ చివరిగా ఉంది.

అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు బి.ఏ (B.A), బి.కామ్ (B.Com), బి.ఎస్సీ (B.Sc) ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఎకనామిక్స్, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ, MBA, MBA (HHCM) ఓపెన్ యూనివర్సిటీలో ఉంటాయి. ఎంఎస్సీ మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథ్స్, బోటనీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫిజిక్స్, జువాలజీతోపాటుగా M.Com కూడా చేయవచ్చు.
డిప్లొమా కోర్సుల్లో BLISc (బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్), MLISc (మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్), పీజీ డిప్లొమాలో చూసుకుంటే.. మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ (HRM), ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, హ్యూమన్ రైట్స్, కల్చర్ & హెరిటేజ్ టూరిజం, జెండర్ స్టడీస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, డిజిటల్ జర్నలిజం, ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఉన్నాయి.
సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌లు చేయాలనుకునేవారికోసం ఫుడ్ అండ్ న్యూట్రిషన్, లిటరసీ అండ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్, NGO మేనేజ్‌మెంట్, ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఉన్నాయి.
కోర్సును బట్టి అభ్యర్థుల కనీస అర్హతలు ఉంటాయి. యూజీ / సర్టిఫికెట్ కోర్సులు 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ / తత్సమాన విద్యార్హత ఉండాలి. పీజీ, పీజీ డిప్లోమా, లైబ్రరీ సైన్స్‌లో సంబంధిత సబ్జెక్టులో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి.
విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ప్రవేశాలు, అధ్యయన కేంద్రాలు లేదా దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన ఇతర సందేహాల కోసం విశ్వవిద్యాలయ అధ్యయన కేంద్రాలను లేదా క్రింది హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించవచ్చు:
హెల్ప్‌లైన్ నంబర్లు: 040-23680222 / 333 / 444 / 555
మొబైల్ నంబర్: 7382929570
టోల్ ఫ్రీ నంబర్: 1800 599 0101
అధికారిక వెబ్‌సైట్: www.online.braou.ac.in లేదా www.braou.ac.in
బీఎస్సీ కోర్సులో చేరాలనుకునే వారు ఇంటర్‌లో సైన్స్ సబ్జెక్టులు చదివి ఉండాలి. ఫీజులు చూస్తే…. మొదటి సంవత్సరం రూ. 3,200, ద్వితీయ సంవత్సరం రూ. 3,000, తృతీయ సంవత్సరం రూ. 3,000 ఉంటుంది. సైన్స్ విద్యార్థులకు ల్యాబ్ ప్రాక్టికల్ ఫీజు అదనంగా ఉంటుంది. (సైన్స్ సబ్జెక్టులకు రూ. 1,600, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్‌కు రూ. 800 చొప్పున, కంప్యూటర్ అప్లికేషన్స్‌కు రూ. 4,000 చొప్పున చెల్లించాలి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


