BRAOU MBA Admissions 2026 : అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో ఎంబీఏ అడ్మిషన్లు - నోటిఫికేషన్ విడుదల

BRAOU MBA Admission Notification 2026 : బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో ఎంబీఏ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఎంబీఏ (MBA), ఎంబీఏ హెచ్‌హెచ్‌సీఎం (HHCM) కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఆగస్టు 5లోపు అప్లికేషన్ చేసుకోవాలి.

Published on: Jun 29, 2026, 14:30:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

BRAOU MBA Notification 2026 : డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) నుంచి ఎంబీఏ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది . 2026-27 విద్యా సంవత్సరానికి గానూ ప్రతిష్టాత్మక మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఎంబీఏ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్ [MBA (HHCM)] కోర్సుల్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఉన్నత చదువులు చదవాలనుకునే అభ్యర్థులు, ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో ఎంబీఏ అడ్మిషన్లు
అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో ఎంబీఏ అడ్మిషన్లు

వివరాలు :

  • మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA)
  • ఎంబీఏ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్ MBA (HHCM)
  • అభ్యర్థులు 2006 జూన్ 1వ తేదీ లేదా అంతకంటే ముందు జన్మించి ఉండాలి. గరిష్ట వయోపరిమితి ఏదీ లేదు.
  • ప్రస్తుతం చివరి సంవత్సరం లేదా చివరి సెమిస్టర్ పరీక్షలు రాసి ఫలితాల కోసం వేచి చూస్తున్న విద్యార్థులు కూడా ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 50 శాతం మార్కులతో (ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు) ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఫైన్ ఆర్ట్స్ మరియు ఓరియంటల్ లాంగ్వేజెస్ డిగ్రీలు చేసిన వారు ఈ కోర్సులకు అర్హులు కారు. ఉద్యోగం చేస్తూ ఎంబీఏ చేయాలనుకునే అభ్యర్థులకు ఏదైనా సంస్థలో కనీసం మూడేళ్ల పని అనుభవం ఉండటం తప్పనిసరి.

అభ్యర్థుల ఎంపిక యూనివర్సిటీ నిర్వహించే ప్రవేశ పరీక్ష మార్కుల ఆధారంగా జరుగుతుంది. అయితే, తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన టీజీ ఐసెట్ -2026 (TG ICET-2026) పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ అంబేడ్కర్ వర్సిటీ ప్రవేశ పరీక్షను రాయాల్సిన అవసరం లేదు. వారు నేరుగా ఐసెట్ ర్యాంకు ద్వారా వర్సిటీ నిబంధనల ప్రకారం ప్రవేశాలు పొందవచ్చు.

అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. సాధారణ కేటగిరీ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 1,500 కాగా, ఎస్సీ, ఎస్టీ, మరియు దివ్యాంగులకు (PWD) రూ. 1,000 గా నిర్ణయించారు. ప్రవేశ పరీక్షను ఆఫ్‌లైన్ (పెన్-పేపర్) విధానంలో నిర్వహిస్తారు.

విద్యార్థుల సౌకర్యార్థం ప్రశ్నపత్రం ఇంగ్లీష్, తెలుగు రెండు భాషల్లోనూ అందుబాటులో ఉంటుంది. పరీక్షలో క్వాలిఫై కావడానికి కనీసం 25 శాతం (50 మార్కులు) ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి కనీస మార్కుల నిబంధన లేదు.

ముఖ్యమైన తేదీలు (కౌన్సెలింగ్ షెడ్యూల్):

  • దరఖాస్తుకు చివరి తేదీ (ఆలస్య రుసుము లేకుండా): 05 ఆగస్టు, 2026
  • రూ. 500 ఆలస్య రుసుముతో చివరి తేదీ: 16 ఆగస్టు, 2026
  • హాల్ టికెట్ల డౌన్‌లోడ్ ప్రారంభం: 20 ఆగస్టు, 2026
  • ప్రవేశ పరీక్ష తేదీ: 23 ఆగస్టు, 2026 (సమయం: ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 12:30 వరకు)
  • ప్రాథమిక కీ విడుదల: 25 ఆగస్టు, 2026
  • కీ పై అభ్యంతరాల స్వీకరణకు చివరి తేదీ: 27 ఆగస్టు, 2026
  • ప్రవేశ పరీక్ష ఫలితాల వెల్లడి: 31 ఆగస్టు, 2026
  • ఎంబీఏ (HHCM) అడ్మిషన్ కౌన్సెలింగ్: సెప్టెంబర్ రెండో వారం.

పరీక్షా కేంద్రాలు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 9 నగరాల్లో ఈ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, హనుమకొండ (వరంగల్) లలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలతో పాటు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రధాన కార్యాలయం ఉన్నాయి. మరిన్ని వివరాలు, సిలబస్, సమాచార పుస్తకము (Prospectus) కోసం అభ్యర్థులు వర్సిటీ అధికారిక వెబ్‌సైట్ www.braou.ac.in లేదా www.braouonline.in సందర్శించవచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More