BRAOU Updates : అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ విద్యార్థులకు అలర్ట్ - ఫీజు గడువు పొడిగింపు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ UG, PG, డిప్లొమా కోర్సుల ట్యూషన్ ఫీజు చెల్లింపు గడువును నవంబర్ 7 వరకు పొడిగించింది. ఆన్లైన్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఈ రుసుము చెల్లించవచ్చు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం విద్యార్థులకు ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. వివిధ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థుల ట్యూషన్ ఫీజు చెల్లింపు చివరి తేదీని పొడిగిస్తూ వర్సిటీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక వెసులుబాటు కింద ఈ గడువును 2026 నవంబర్ 7 వరకు పెంచినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

గడువు వివరాలు
అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులైన బీఏ, బీ.కామ్ (B.Com), బీ.ఎస్సీ ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న 2021-2025 బ్యాచ్ విద్యార్థులు ఈ అవకాశం ఉపయోగించుకోవచ్చు. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ (కోర్సులైన ఎం.ఏ , ఎం.కామ్ (M.Com), ఎం.ఎస్సీ (M.Sc), ఎం.బి.ఏ కోర్సులలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న 2023-2025 బ్యాచ్ విద్యార్థులు కూడా తమ ట్యూషన్ ఫీజును సకాలంలో చెల్లించవచ్చు.
వివిధ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు కూడా పెంచిన గడువు లోగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 'TS/AP ఆన్లైన్ కేంద్రాల' ద్వారా కానీ, డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఆన్లైన్ పద్ధతిలో కానీ ఫీజు చెల్లింపులు పూర్తి చేయవచ్చని అధికారులు సూచించారు.
మరిన్ని వివరాలు, సందేహాల నివృత్తి కోసం విద్యార్థులు తమకు సమీపంలోని యూనివర్సిటీ అధ్యయన కేంద్రాలను సంప్రదించవచ్చు. లేదా 040-23680333 / 444 / 555 హెల్ప్లైన్ నంబర్లకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు. అలాగే వర్సిటీ అధికారిక వెబ్సైట్ http://www.braouonline.in/ ద్వారా పూర్తి వివరాలను తనిఖీ చేసుకోవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

