జగిత్యాలలో బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబీ బాస్ కేసీఆర్.. కండువా కప్పి జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సభలో కేసీఆర్ మాట్లాడారు.
బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా జీవన్ రెడ్డి

'జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరారంటేనే ఊపు వస్తుంది. జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా మాత్రమే కాదు.. పాత కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ పరిసర జిల్లాల బాధ్యతలు చూడాలి. జీవన్ రెడ్డిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నాను. ఆరు నూరైనా నూటికి నూటి శాతం మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక కూడా జీవన్ రెడ్డి అనేక పదవులు, సేవలు అందిస్తారు.' అని కేసీఆర్ అన్నారు.
45 ఏళ్ల నుంచి తాము స్నేహితులమని కేసీఆర్ చెప్పారు. భిన్న రాజకీయ సిద్ధాంతాల కారణంగా విడివిడిగా పనిచేశామన్నారు. బాధలు, సుఖాలు, అభిప్రాయలను పంచుకునేవాళ్లమన్నారు. జీవన్ రెడ్డికి ఉండే నిబద్ధత, ప్రజా జీవితంలో పనిచేసిన పద్ధతి ఎందరికో ఆదర్శమన్నారు. జీవన్ రెడ్డి ఒక్క జగిత్యాలలోనే కాదని, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా, పొరుగున ఉన్న అనేక జిల్లాల్లో ఆయనకు అభిమానులు ఉన్నారన్నారు.
నా వయసు 72.. పోరాటం ఆగదు!
కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ.. "జీవన్ రెడ్డి గారికి 75 ఏళ్లు, నాకు 72 ఏళ్లు. మనకేం ముసలితనం రాలేదు. మన వయసు 25 ఏళ్లు తగ్గిందని భావించి, యువకుల్లా పోరాడదాం.' అని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలు గర్వంగా తలెత్తుకుని బతికే వరకు తన చివరి శ్వాస వరకు పోరాడుతూనే ఉంటానని కేసీఆర్ స్పష్టం చేశారు.
హైడ్రాపై కేసీఆర్ ఫైర్
హైడ్రాపై ఈ సందర్భంగా కేసీఆస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం పేదల ఇళ్లను కూల్చడానికే హైడ్రా పనికివస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని.. హైడ్రాను ఎత్తి అవతలపడేస్తామని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 'హైడ్రా'పై కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఈ అందానికి బోడి హైడ్రా ఒకటా?" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
మూసీ ప్రాజెక్ట్ దందా?
{{/usCountry}}హైడ్రాపై ఈ సందర్భంగా కేసీఆస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం పేదల ఇళ్లను కూల్చడానికే హైడ్రా పనికివస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని.. హైడ్రాను ఎత్తి అవతలపడేస్తామని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 'హైడ్రా'పై కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఈ అందానికి బోడి హైడ్రా ఒకటా?" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
మూసీ ప్రాజెక్ట్ దందా?
{{/usCountry}}మూసీ ప్రక్షాళన పేరుతో 15 వేల ఇళ్లు కూలగొట్టడం ఏంటని కేసీఆర్ ప్రశ్నించారు. ఇది కేవలం రియల్ ఎస్టేట్ దందా అని ఆరోపించారు. తమ హయాంలో 46 వేల చెరువులను బాగు చేశామని, కానీ ఒక్క గుడిసెను కూడా తాకలేదని గుర్తు చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏ వర్గం సంతోషంగా లేదని కేసీఆర్ విమర్శించారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది, ఆర్థిక వ్యవస్థ నాశనమైందన్నారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, విద్యార్థులు, ఆటో కార్మికులు.. ఇలా ప్రతి ఒక్కరి జీవితం ఆగమైందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తాము ఇంటింటికి నల్లా నీరు ఇచ్చామని, ఇప్పుడు మళ్లీ నీటి కష్టాలు ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు.